Multibagger Stock: మూడేళ్లలో రూ.500 నుంచి రూ.4,400 పెరిగిన స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో అనే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే భారీ రాబడి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ ల్లో
నెట్‌వెబ్ టెక్నాలజీస్ స్టాక్ ఒకటి. నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లు జూలై 2023లో లిస్టింగ్ అయినప్పటి నుండి దాని వాటాదారులకు డబ్బు సంపాదించి పెట్టే స్టాక్‌గా నిలిచాయి. నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లను జూలై 2023లో ప్రైమరీ మార్కెట్‌లో రూ.500 గరిష్ట ధర పరిధిలో ఆఫర్ చేయగా ఈ స్టాక్ NSEలో ఏకంగా 89 సాతం ప్రీమియంతో రూ.947 వద్ద లిస్ట్ అయింది. నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్ల జోరు ఇక్కడితో ఆగలేదు. ఈ స్టాక్ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉండి. దీర్ఘకాలిక వాటాదారులకు సంపద సృష్టికర్తగా నిలిచింది. ఈరోజు నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేరు ధర సుమారు రూ.4,400గా ఉంది. ఇది ఒక్కో ఈక్విటీ షేరుకు ఉన్న రూ.500 IPO ధర కంటే దాదాపు 780% ఎక్కువ.
2026 రెండవ త్రైమాసికంలో వచ్చిన బలమైన ఫలితాల కారణంగా ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేరు ధర వద్ద కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా కంపెనీ తన అత్యధిక త్రైమాసిక పనితీరును నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు, ఆర్డర్ బుక్, నికర లాభం గత ఏడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. వచ్చే ఏడాదికి కంపెనీ ఇచ్చిన పటిష్టమైన మార్గదర్శకాల కారణంగా ఈ బలమైన పనితీరు కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు.రూ.5,560 దీర్ఘకాలిక లక్ష్య ధరను నిర్దేశించారు.

గత త్రైమాసికంతో పోలిస్తే రూ.2,510 కోట్ల ఆర్డర్లు రాగా, 2వ త్రైమాసికం ముగిసే నాటికి రూ.2,630 కోట్ల బలమైన ఆర్డర్లను పరిగణనలోకి తీసుకుంటే, FY27E మరియు ఆ తర్వాతి కాలానికి నెట్‌వెబ్ వృద్ధి మరింత ఊపందుకుంటుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. 2వ త్రైమాసికం ముగిసే నాటికి ఉన్న రూ.650 కోట్ల L1-పైప్‌లైన్‌తో పాటు, నెట్‌వెబ్ రూ.1,1150 కోట్ల విలువైన బలమైన పైప్‌లైన్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. నెట్‌వెబ్ గత త్రైమాసికంతో పోలిస్తే రూ.10,410 కోట్ల ఆర్డర్ పైప్‌లైన్‌ను రూ.11,150 కోట్లుకు పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే రూ.2,510 కోట్ల ఆర్డర్ బుక్‌ను రూ.2,630 కోట్లుగా నివేదించింది.
ప్రస్తుత వాటాదారులు రూ.4,040 వద్ద స్టాప్-లాస్ కొనసాగిస్తూ షేరును అట్టిపెట్టుకోవచ్చని కేసీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ఎం ఓఝా చెప్పారు. ఒకవేళ రూ.4,650 స్థాయిని దాటితే ఈ స్టాక్ త్వరలోనే రూ.5,150ని తాకవచ్చని అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications