MultiBagger Stock: మూడేళ్లలో రూ.815 నుంచి రూ.5,455 చేరిన మల్టీబ్యాగర్ స్టాక్..

మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తున్న స్టాక్ ల్లో నెట్ వెబ్ టక్నాలజీస్ ఇండియా స్టాక్ ఒకటి. తాజాగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.1,200 కోట్లను విజయవంతంగా సమీకరించిన తర్వాత, సోమవారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా షేర్ ధర BSEలో 4 శాతం పెరిగి రూ.5,774 వద్ద సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత క్షిణించింది. ఈ ఐటీ-ఆధారిత సేవల సంస్థ షేర్ గత రెండు ట్రేడింగ్ రోజున కూడా లాభాల్లో కొనసాగింది. ఈ కాలంలో ఇది మొత్తం 15 శాతం మేర పెరిగింది. గత నెలలో సెన్సెక్స్ 2.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, నెట్‌వెబ్ షేర్ ధర 40 శాతం దూసుకెళ్లింది. అంతేకాకుండా 2026 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు బెంచ్‌మార్క్ సూచీ 8.8 శాతం క్షీణించగా, నెట్‌వెబ్ షేర్ ధర 87 శాతం రాబడి ఇచ్చింది.

ఆగస్ట్ 18, 2023 ఈ స్టాక్ ప్రైస్ రూ.815 ఉండగా.. ఈ రోజు స్టాక్ ప్రైస్ రూ.5,455కు చేరింది. ఈ స్టాక్ మూడేళ్ల కాలంలో 500 శాతానికి పైగా రాబడి ఇచ్చింది. నెట్‌వెబ్ తన QIP ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ఒక్కో షేరుకు రూ.4,790 చొప్పున 25.05 లక్షల (2.505 మిలియన్ల) ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా రూ.1,200 కోట్లను సమీకరించింది. ఈ ఇష్యూ ధర 'ఫ్లోర్ ప్రైస్' (కనీస ధర) కంటే 1.96 శాతం తక్కువగా నిర్ణయించారు. దీనివల్ల కంపెనీ చెల్లింపు ఈక్విటీ మూలధనం 56.9 మిలియన్ షేర్ల నుంచి 59.4 మిలియన్ షేర్లకు పెరిగింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ లో నోమురా ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కు 13.1 శాతం, గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకు 11.2 శాతం, థింక్ ఇండియా ఆపర్చునిటీస్ మాస్టర్ ఫండ్ కు 8.3 శాతం, ఇన్వెస్కో ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కు 6.3 శాతం కేటాయించింది.

multibagger stock

నెట్‌వెబ్ భారతదేశానికి చెందిన ప్రముఖ 'హై-ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్' (HCS) ప్రొవైడర్. ఇది భారతీయ మూలాలు, యాజమాన్యం, నియంత్రణ కలిగిన సంస్థ కాగా, డిజైన్, తయారీ, అమలు వంటి అంశాలలో పూర్తి స్థాయి సామర్థ్యాలను కలిగి ఉంది. నెట్‌వెబ్ HCS సేవలలో HPC, ప్రైవేట్ క్లౌడ్, HCI, AI సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ స్టోరేజ్ (HPS), డేటా సెంటర్ సర్వర్లు వంటివి ఉన్నాయి. Netweb సంస్థ IT, ITES (IT-ఆధారిత సేవలు), BFSI (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), జాతీయ డేటా కేంద్రాలు, రక్షణ, విద్య, పరిశోధన & అభివృద్ధి (R&D) సంస్థల వంటి ప్రభుత్వ విభాగాలకు సమగ్రమైన ఉత్పత్తులను అందిస్తుంది.

Netweb సంస్థ 'కబ్రు'', పరం యువ II' సూపర్ కంప్యూటర్ల ఏర్పాటులో పాలుపంచుకుంది. అలాగే, ఇది భారత ప్రభుత్వపు 'నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్'లో కూడా భాగస్వామిగా ఉంది.
జూన్ 30, 2026 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.2,506.94 కోట్లుగా ఉంది. ఇందులో రూ.848.05 కోట్ల విలువైన 'L1' (అత్యల్ప బిడ్) ఆర్డర్లు, రూ. ₹10,410 కోట్ల విలువైన 'పైప్‌లైన్' ఉన్నాయి. ఇవి మధ్యకాలిక వ్యాపార వృద్ధికి బలమైన సంకేతాలను అందిస్తున్నాయి. IIT, ISRO, Railtel, ఢిల్లీ యూనివర్సిటీ, Infosys, Yotta, Zoho, TCS వంటి ప్రముఖ సంస్థలతో కంపెనీ యాజమాన్యానికి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. వీరి వినియోగదారుల శ్రేణి వివిధ భౌగోళిక ప్రాంతాలకు విస్తరించి ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+