రూ. 12 వేల కోట్లకు పైగా డీల్..మరుక్షణమే కుప్పకూలిన షేర్లు..నెక్టార్ లైఫ్ సైన్సెస్ అమ్మకం కథ ఇదిగో..

Nectar Lifesciences Shares Crashes: సాధారణంగా ప్రముఖ కంపెనీలు తమ ముఖ్యమైన వ్యాపారంపై దృష్టి సారించేందుకు ఇతర వ్యాపారాల నుండి నిష్క్రమిస్తూ ఉంటాయి. అయితే ఫార్మా రంగానికి చెందిన నెక్టార్ లైఫ్ సైన్సెస్ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించి మార్కెట్లో సంచలనం రేపింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించిన ప్రకారం అ కంపెనీ తన ప్రధాన వ్యాపారాన్ని రూ. 1,270 కోట్లకు Ceph Lifesciences Private Limited కు విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో పెట్టుబడిదారుల్లో భయాందోళన నెలకొంది. ఈ వార్త వెలువడిన వెంటనే కంపెనీ వాటాదారులలో తీవ్ర భయాందోళన నెలకొనడంతో కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలాయి.

స్టాక్ మార్కెట్లో అమ్మకాలు తీవ్రతరం కావడంతో ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకుండా షేర్లు అత్యల్ప స్థాయి ధరకు చేరుకున్నాయి.ఈ కంపెనీ షేరు ధర దాదాపు 20 శాతం పడిపోయి రూ. 18.53 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. అమ్మకం ప్రకటనతో గత సంవత్సరం సెప్టెంబర్ 11న రూ. 56.39 వద్ద ఉన్న షేర్లు ఇప్పటి వరకు సుమారు 67 శాతం విలువను కోల్పోయాయి. మే నెలలో 23% లాభపడిన ఈ షేరు తరువాతి నెలల్లో వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. గత నెల జూన్‌లో 18%, ప్రస్తుత జూలైలో ఇప్పటికే 14% పతనమైంది.

Nectar Lifesciences Nectar Lifesciences share price Nectar stock crash Ceph Lifesciences 1 270 crore deal business sale stock market news 52-week low Indian stock market pharma sector news NSE BSE investor news market update share market today stock market crash pharma stocks India Ceph 1 270 52 NSE BSE

నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఎందుకు వ్యాపారం అమ్ముతోంది? నెక్టార్ లైఫ్ సైన్సెస్ తన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (API) ఫార్ములేషన్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడానికి డెఫినిటివ్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన మెన్తాల్ వ్యాపారాన్నికూడా రూ. 20 కోట్లకు విక్రయించనుంది. మొత్తం లావాదేవీ విలువ రూ. 1,290 కోట్లుగా ఉంది. ఈ కీలక నిర్ణయం ద్వారా నెక్టార్ కంపెనీ తన వ్యాపారాన్ని సరళీకృతం చేసి...ఉన్న అప్పులను తీరుస్తూ, కొత్త వ్యాపార అవకాశాల్లో పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, వాటాదారులకు డివిడెండ్లు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.

సంస్థ అధినేత శ్రీ సంజీవ్ గోయల్ మాట్లాడుతూ..ఈ ఒప్పందం నెక్టార్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. వృద్ధి చెందిన, పెట్టుబడులు ఎక్కువగా అవసరమైన విభాగాలను విడిచిపెట్టి, సంస్థను సరికొత్త మార్గంలో మరింత దగ్గరగా తీసుకెళ్లే దిశగా మేము అడుగులు వేస్తున్నామని తెలిపారు. కాగా కంపెనీ సెప్టెంబర్ 20, 2025 లోపు షేర్ హోల్డర్ల అనుమతితో ఈ విక్రయం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని జూలై 7, 2025 న కంపెనీ బోర్డు ఆమోదించింది. ఆగస్టు 4, 2025 న షేర్ హోల్డర్ల నుంచి అనుమతి పొందేందుకు ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ (EGM) నిర్వహించనుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+