NACDAC Infrastructure IPO: డిసెంబర్ నెల చివరికి వచ్చేసనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోల రద్దీ మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని ఐపీవోలు మాత్రం లిస్టింగ్ కి ముందే గ్రేమార్కెట్లో భారీ రాబడులను అందిస్తున్నాయి. ఈక్విటీల్లో కంటే ఐపీవోలతో మంచి రాబడులను అందుకోవటంతో చాలా మంది వీటిపైనే అధికంగా బెట్టింగ్ వేయటానికి ఇష్టపడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్ఎసీడీఎసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీవో గురించే. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10.01 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 28.60 లక్షల షేర్లను విక్రయించింది. కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ సబ్ స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు అందుబాటులో ఉంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో డిసెంబర్ 24న మార్కెట్లో జాబితా కోసం వస్తుందని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. కంపెనీ షేర్లు ఈ క్రమంలో బీఎస్ఈలో లిస్టింగ్ జరగనున్నాయి.

ప్రస్తుత ఐపీవో కోసం ఎన్ఎసీడీఎసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.33-35గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 4000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడం కోసం కనీసం రూ.1.40 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. మార్కెట్లో ఐపీవోకు బలమైన స్పందన లభించటంతో ఇష్యూ చరిత్రలో అత్యధిక సభ్యత్వాన్ని పొందింది. ఈ క్రమంలో వాస్తవానికి కంపెనీ రూ.10 కోట్లను సమీకరించటానికి షేర్లను ఇష్యూ చేయగా పెట్టుబడిదారుల నుంచి రూ.14,000 కోట్ల విలువైన షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. అలాగే ఐపీవో ముగింపు రోజున రిటైల్ విభాగంలో 2503 సార్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2.73 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
గ్రేమార్కెట్లో పనితీరు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం NACDAC Infrastructure ఐపీవో గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.50 కంటే ఎక్కువ ప్రీమియం పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే షేర్లు ఒక్కోటి రూ.85 రేటు వద్ద మార్కెట్లో జాబితా అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై షేరుకు దాదాపు 143 శాతం వరకు రాబడిని అందుకుంటారని తెలుస్తోంది. వాస్తవానికి గ్రేమార్కెట్లో పలికే ప్రీమియం కంపెనీ ఇష్యూ ధర కంటే అధికంగా పెట్టుబడిదారులు చెల్లించటానికి సిద్ధంగా ఉన్న మెుత్తాన్ని సూచిస్తుంది. అంటే ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు తొలిరోజే బంపర్ లాభాలను ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ వ్యాపారం..
2012లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా నిర్మాణ వ్యాపారంలో ఉంది. సంస్థ బహుళ అంతస్తుల భవనాలు, నివాస, వాణిజ్య, సంస్థాగత నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉంది. కంపెనీ క్లాస్ ఏ కాంట్రాక్టరుగా గుర్తింపు తెచ్చుకుంది. బహుళ-అంతస్తుల భవనాలు, ఉక్కు నిర్మాణ పనులు, గృహనిర్వాహక, మానవ వనరుల సరఫరా, వంతెనలు, విద్యుత్ పనుల నిర్మాణంలో ప్రసిద్ధి పొందింది. ఇప్పటి వరకు కంపెనీ దాదాపు 45 ప్రాజెక్టులను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం పనిచేస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వంతో పాటు, ఉత్తరాఖండ్ కోసం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. కంపెనీ థర్డ్-పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ ప్రాజెక్టుల కోసం సబ్-కాంట్రాక్ట్‌లను కూడా చేపడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications