NACDAC Infrastructure IPO: దేశీయంగా స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ నెల నిజంగా ఐపీవోలపై బెట్టింగ్ వేసేవారికి బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. అనేక ఐపీవోలు పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభాన్ని ఆర్జించిపెట్టాయి. ఇదే క్రమంలో రానున్న వారంలో వస్తున్న ఐపీవోపై ఇన్వెస్టర్ల ఫోకస్ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్ఏసీడీఏసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీవో గురించే. కొత్తగా ఐపీవోపై బెట్టింగ్ వేయాలనుకుంటున్న వారికి ఇది ఒక శుభసమయంగా చెప్పుకోవచ్చు. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10.01 కోట్లను కమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం కంపెనీ 28.6 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు బెట్టింగ్ వేసేందుకు దరఖాస్తుదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే షేర్ల అలాట్మెంట్ డిసెంబర్ 20న, కంపెనీ షేర్ల లిస్టింగ్ డిసెంబర్ 24న ఉండనుందని తెలుస్తోంది.

కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.33-35గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 4000 షేర్లుగా ఉంచింది. దీంతో సాధారణ ఇన్వెస్టర్లు కనీసం ఒకలాట్ కొనుగోలు చేయటానికి రూ.1.40 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఐపీవో ఓపెన్ కావటానికి ముందుగానే షేర్ రికార్డు ర్యాలీని చూస్తోంది. ఒక్కో షేరుపై దాదాపు 60 శాతం ప్రీమియం ధర పలుకుతోంది. అంటే కంపెనీ షేర్లు ఒక్కోటి లిస్టింగ్ రోజున రూ.56 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇష్యూ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరపై ఒక్కో షేరుకు రూ.21 ప్రీమియం పలుకుతోంది.
కంపెనీ ప్రమోటర్లుగా ఉన్న హేమంత్ శర్మ, ఉమా శర్మ, ఆశిష్ సక్సేనాకు 95.9 శాతం వాటాను హోల్డ్ చేస్తుండగా.. ఐపీవో లిస్టింగ్ తర్వాత ఇది 67.13 శాతానికి తగ్గనుంది. ఈ క్రమంలో కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, క్యూఐబీలకు 50 శాతం, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం షేర్లను రిజర్వు చేసింది.
కంపెనీ వ్యాపారం..
NACDAC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ 2012లో స్థాపించబడింది. ఇది మల్టీస్టోరీడ్ భవనాలు, ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలను చేపడ్డంలో నైపుణ్యం కలిగి ఉంది. కంపెనీ ఉత్తరాఖండ్ పెయ్జల్ సంసధన్ వికాస్ ఎవుమ్ నిర్మాణ్ నిగమ్‌తో రిజిస్టర్ చేయబడిన క్లాస్ A కాంట్రాక్టర్, ISO సర్టిఫికేట్ కూడా పొందింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కోసం పనిచేస్తున్న కంపెనీ దాదాపు 45 ప్రాజెక్టులను పూర్తి చేసింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications