Multibagger Stock: దూసుకెళ్తున్న మల్టీబ్యాగర్ స్టాక్.. రూ.లక్షను రూ.67 లక్షలు చేసింది..!
వెల్నెస్, పర్సనల్ కేర్ కంపెనీ అయిన క్యూపిడ్ లిమిటెడ్ తన 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తన లాభం, ఆదాయ అంచనాలను మరింత పెంచింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో దాని షేర్లు 6 శాతం పెరిగాయి. గురువారం కూడా ఒక్కో షేరు 1.63 శాతం పెరిగి రూ.270.65 చేరుకుంది. గ్లోబల్ హెల్త్‌కేర్, భారత్ కన్స్యూమర్ వ్యాపారం రెండింటిలోనూ స్థిరమైన వృద్ధిని సాధిస్తామని కంపెనీ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం గతేడాదితో పోలిస్తే 142 శాతం వృద్ధితో రూ.157 కోట్లకు చేరగా, పన్ను తర్వాత లాభం 194 శాతం పెరిగి రూ.44 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్ 39 శాతానికి చేరుకుంది.
బలమైన త్రైమాసిక పనితీరు, పటిష్టమైన ఆర్డర్ల లభ్యత మరియు రెండు వ్యాపార విభాగాలలోనూ ఉన్న ఊపును కొనసాగిస్తూ.. క్యూపిడ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, FY27 కు ఆదాయాన్ని రరూ.725-750 కోట్లకు, నికర లాభాన్ని రూ.210-225 కోట్లకు పెంచుతూ ఫ్యూచర్ గైడెన్స్ ఇచ్చింది. మధ్యకాలికంగా FY28లో రూ.1,085 కోట్ల ఆదాయాన్ని, FY29లో రూ.1,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ వ్యాప్తంగా విస్తృత పంపిణీ నెట్‌వర్క్, వినియోగదారు ఉత్పత్తుల నుంచి పెరుగుతున్న వాటా, కొత్త తయారీ సామర్థ్యం, గ్లోబల్ టెండర్ అవకాశాలు, విస్తరిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, తయారీ వేదిక వంటివి తమ వృద్ధి వ్యూహానికి మద్దతు ఇస్తున్నాయని కంపెనీ తెలిపింది.

క్యూపిడ్ వ్యాపారం దాని గ్లోబల్ హెల్త్‌కేర్ వ్యాపారం, భారత్ కన్స్యూమర్ బిజినెస్ అనే రెండు కీలక వృద్ధి విభాగాలతో కొనసాగుతోంది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం FY26లో 125కు పైగా దేశాలకు జరిగిన ఎగుమతులు రూ.208 కోట్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం ఆదాయంలో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉంది. మరోవైపు కండోమ్‌లు, పర్సనల్ లూబ్రికెంట్లు, పెరుగుతున్న కన్స్యూమర్ హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న దాని వినియోగదారుల వ్యాపారం, ఇటీవల ప్రారంభించిన ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల నుంచి వచ్చిన రూ.84 కోట్లతో సహా, FY26లో దాదాపు రూ.122 కోట్ల ఆదాయాన్ని అందించింది.
ఈ స్టాక్ 605.24 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఈ స్టాక్ పెట్టుబడిదారుల డబ్బును భారీగా పెంచింది. మూడేళ్లలో 6,623.56 శాతం, ఐదేళ్లలో అసాధారణమైన 11,956.03 శాతం వృద్ధితో పెట్టుబడి విలువను నాలుగింతలకు పైగా పెంచింది. నాలుగేళ్ల క్రితం ఈ స్టాక్‌లో పెట్టిన రూ.1 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.2 కోట్లకు చేరి ఉండేది. అలాగే మూడేళ్ల క్రితం పెట్టిన అంతే మొత్తంలోని పెట్టుబడి విలువ ఇప్పుడు దాదాపు రూ.67 లక్షలుగా ఉండేది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
