Multibagger: తలరాత మార్చేసిన మల్టీబ్యాగర్.. లక్ష పెట్టిన ఇన్వెస్టర్లు రూ.2 కోట్లు పొందారు!
Mercury Ev-Tech: మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నప్పటికీ స్థిరంగా భారీ లాభాలను అందించేందుకు మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం ఎల్లప్పుడూ ముందువరుసలోనే ఉన్నాయి. వాస్తవానికి పెన్నీ స్టాక్స్ బలం ముందుగా గుర్తించిన వారు మాత్రం వాటి నుంచి మల్టీబ్యాగర్ రాబడులను అందుకుంటున్నారు. అయితే వీటిని జాగ్రత్తగా గుర్తించి ముందుగా పెట్టుబడి పెట్టడంలోనే అసలు లాభాల మ్యాజిక్ ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో ఊహించని రాబడులను తెచ్చిపెట్టిన మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టాక్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఐదేళ్ల కిందట కంపెనీ స్టాక్ ధర ఒక్కోటి కేవలం 36 పైసల నుంచి ప్రస్తుతం రూ.86.79 స్థాయికి పెరిగాయి. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఉదయం 10 గంటల సమయంలో బీఎస్ఈలో ఒక్కోటి రూ.84.47 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

5 ఏళ్ల సమయంలో కంపెనీ షేర్లు నమ్మకంగా కొనసాగిన పెట్టుబడిదారులకు దాదాపు 23,000 శాతం మెగా రాబడిని అందించాయి. ఎవరైనా ఇన్వెస్టర్ ఐదేళ్ల కిందట కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ ఏకంగా రూ.2 కోట్లకు చేరుకుని ఉండేది. కంపెనీ బలమైన పనితీరు కారణంగా ఇన్వెస్టర్లు ఈవీ స్టాక్ కొనుగోలుకు మక్కువ చూపటం స్టాక్ ధర పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.139.20గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ.64.32 వద్ద ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1600 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇతర రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తుల తయారీలో ఉంది. ఇది వాహనాల తయారీతో పాటు ఈవీల్లో ఉపయోగించే కీలకమైన బ్యాటరీలు, చాసిస్, మోటార్ కంట్రోలర్లు వంటి విడి భాగాలను సైతం తయారు చేయటంలో ఉంది.
కంపెనీ ఉత్పత్తులు టూవీలర్లు, త్రీవీలర్లు, బస్సులు, లోడర్లు, ప్యాసింజర్ వాహనాలకు విస్తరించింది. వివిధ ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చటంలో కంపెనీ ఉత్పత్తులు ఉన్నాయి. కంపెనీకి DC2 Mercury Cars అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. ఇక ఆర్థిక పనితీరు విషయానికి వస్తే.. ఆర్థిక సంవత్సరం రూ.1.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం వ్యాపారం ద్వారా రూ.19.48 కోట్లుగా నిలిచింది.


Click it and Unblock the Notifications