Reliance Jio IPO: ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఉన్న అంబానీ గడచిన ఏడాది జియో ఫైనాన్షియల్ కంపెనీని డీమెర్జ్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక విలువైన కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మరో ఐపీవో ఆయుధాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఎక్కుపెట్టడానికి సిద్ధమౌతున్నట్లు వెల్లడైంది.
దేశంలో కొనసాగుతున్న ఐపీవోల సందడిలో క్రేజీ విషయం ఏమిటంటే అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఐపీవోను 2025లో తీసుకురానున్నట్లు వెల్లడైంది. అయితే ఇది బవిశా భారతీయ స్టాక్ మార్కెట్ ఐపీవోల చరిత్రలో పెద్దదిగా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం నిపుణులు జియో టెలికాం వెంచర్ వ్యాపార విలువను దాదాపు 100 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ముందుగా అంబానీ టెలికాం వ్యాపారం జియోను లిస్ట్ చేస్తారని, అయితే ఇదే సమయంలో కాసుల వర్షం కురిపిస్తున్న రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఐపీవోగా తీసుకురావటానికి కొద్దిగా సమయం తీసుకుంటుందని వెల్లడైంది.

దీనికి ముందు 2019లో అంబానీ జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రత్యేక కంపెనీలుగా లిస్ట్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఎలాంటి గడువు పొడిగింపును ప్రకటించకపోవటంతో మరికొన్ని నెలల్లో ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం జియో దేశంలోని టెలికాం వ్యాపారంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 4.8 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. అయితే ఇటీవల టారిఫ్ రేట్ల పెంపుతో భారీగా కస్టమర్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ 5జీ సేవలపై దృష్టి సారించటంతో పాటు.. ఆఫ్రికా దేశంలోనూ తన వ్యాపారాన్ని చురుకుగా తీసుకెళ్లే ప్రణాళికలో ఉంది.
అయితే అంబానీకి చెందిన జియో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. వాస్తవానికి స్టార్ లింక్ శాటిలైట్ ఆథారిత ఇంటర్నెట్ సౌకర్యం. ఇది మారుమూల ప్రాంతాల్లో సైతం ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల దేశంలో ఏఐ ఇన్ ఫ్రా బిల్డ్ చేసేందుకు అంబానీ అమెరికా చిప్ మేకర్ ఎన్వీడియాతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో రేటింగ్ సంస్థ జెఫరీస్ అంబానీకి చెందిన జియో విలువను 112 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అయితే ఇటీవల వచ్చిన అతిపెద్ద ఆటోమెుబైల్ కంపెనీ హ్యుందాయ్ ఇండియా ఐపీవో 3.3 బిలియన్ డాలర్ల రికార్డును జియో బద్దలు కొట్టొచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications