Mukesh Ambani: తాతా ధీరూబాయ్ని గుర్తు చేసిన మనవడు అనంత్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ..
ముంబైలో జరిగిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ లిస్టింగ్ వేడుకలో తన తాత ధీరూభాయ్ అంబానీ నిరాడంబరమైన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ వారి కుటుంబ ప్రస్థానం గురించి మనవడు అనంత్ అంబానీ మాట్లాడుతున్నప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన పిల్లలైన అనంత్, ఇషా అంబానీలు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ రిలయన్స్ గ్రూప్‌ను తీర్చిదిద్దిన కలలు, విలువలు, కఠోర శ్రమ గురించి వివరిస్తుండగా ముఖేష్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.
గుజరాత్‌లోని చోర్వాడ్లో ఒక సాదాసీదా ఇంటిలో తమ తాతగారి కల మొదలైందని చెప్పారు. ధీరూభాయ్ ఒకప్పుడు డబ్బు గానీ, పరిచయాలు గానీ లేకుండా ఏడెన్‌లోని ఒక పెట్రోల్ పంపులో ఎలా పనిచేసేవారో ఆయన గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ ధీరూభాయ్ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి, ఒక సామాన్య భారతీయుడు కూడా పెద్ద కలలు కనగలడని, అసాధారణమైన విజయాలు సాధించగలడని నిరూపించారని వివరించారు. భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్న తన తండ్రి దార్శనికత గురించి కూడా అనంత్ మాట్లాడారు. ఆశయం, కఠోర శ్రమ ద్వారా దేశం ఏమి సాధించగలదో చెప్పడానికి, జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని ఆయన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

ఆ తర్వాత ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే కల చుట్టూ నిర్మించబడిన జియో ప్రస్థానాన్ని ఆయన వివరించారు. ఈ లిస్టింగ్ కంపెనీకి ఒక మైలురాయి మాత్రమే కాదని దీనిని సాధ్యం చేయడంలో సహాయపడిన ప్రజలను అభినందించే సందర్భం కూడా అని అనంత్ అన్నారు. కంపెనీ విజయం కోసం జియో ఉద్యోగులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, సర్వీస్ బృందాలు, రిటైల్ భాగస్వాములు చేసిన కృషిని అనంత్ ప్రశంసించారు. ఈషా అంబానీ ధీరూభాయ్‌కి నివాళులర్పిస్తూ సామాన్య భారతీయులకు కూడా దేశ వృద్ధిలో వాటా దక్కాలని ఆయన నమ్మేవారని గుర్తుచేసుకున్నారు.
కాగా అక్టోబర్ 28 జియో ప్లాట్ ఫామ్ షేర్లు ప్రీమియంలో లిస్ట్ అయ్యాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఒక్కో షేరు రూ. 1,359 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇది ఒక్కో షేరు ఐపీఓ ధర అయిన రూ. 1,119 కంటే 21.36% ప్రీమియంను సూచిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఐపీఓ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ లిస్టింగ్ జరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications