Multibagger Stock: 11 నెలల్లో రూ.1408 నుంచి రూ.7,180 చేరిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
మల్టీబ్యాగ్ రిటర్న్స్ అందించే కంపెనీల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ కొద్ది సంవత్సరాలుగా రాణిస్తున్నాయి. కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో రూ.10.8 కోట్లుగా ఉన్న MTAR టెక్నాలజీస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2027 మొదటి త్రైమాసికంలో రూ.50.2 కోట్లకు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే లాభం 13 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.360.7 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 130.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.156.6 కోట్లుగా ఉండేది. త్రైమాసిక ప్రాతిపదికన (Q-o-Q), ఆదాయం దాదాపు 18 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.28.4 కోట్లుగా ఉన్న ఎబిట్టా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.85.1 కోట్లకు చేరింది. Q1లో వివిధ రంగాల నుంచి రూ.2,895.1 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. ఇది ఒకే త్రైమాసికంలో సాధించిన అత్యధిక ఆర్డర్లు రావడం విశేషం. అంతేకాకుండా ఇది FY26 మొత్తం ఆర్డర్ల విలువ అయిన రూ.2,453.3 కోట్లను కూడా అధిగమించింది. 30 జూన్ 2026 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.5,143.3 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది.

తమ ప్రధాన వ్యాపార విభాగాలు అన్నీ తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉన్నాయని ఆ కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. MTAR టెక్నాలజీస్ షేర్లు గత 6 నెలల్లో 91 శాతం పెరిగాయి. సంవత్సరం కాలంగా ఎంటీఏఆర్ షేర్లు 366 శాతం పెరిగాయి. MTAR టెక్నాలజీస్ స్టాక్ ప్రైస్ 2025 సెప్టెంబర్ లో రూ.1408 ఉండగా.. 2026 ఆగస్ట్ 18న ఈ స్టాక్ ప్రైస్ రూ.7,180 చేరుకుంది. జూన్ 19న రూ.8,714 గరిష్ట స్థాయికి చేరినప్పటి నుండి MTAR టెక్నాలజీస్ 'లోయర్ లో-లోయర్ హై' నిర్మాణాన్ని ఏర్పరుస్తోందని SBI సెక్యూరిటీస్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా చెప్పారు. ఈ స్టాక్ తన 20, 50,100-రోజుల EMAల కంటే దిగువన ట్రేడ్ అవుతోందని, ఇది స్వల్పకాలిక ధరల నిర్మాణంలో బలహీనతను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రూ.6,050-6,100 జోన్ తక్షణ నిరోధకంగా పనిచేసే అవకాశం ఉందన్నారు. కాగా స్టాక్ ఇప్పటికే భారీగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ తీసుకోవడమేనని చెబుతున్నారు. ఎప్పుడైనా వాల్యూవేషన్ రిజనబుల్ గా ఉన్నప్పుడు మాత్రం స్టాక్ కొనుగోలు చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications