భారతీయ స్టాక్ మార్కెట్ వచ్చే ఏడాదిలో అత్యంత బలంగా పుంజుకోవడానికి సిద్ధంగా ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. 2026 డిసెంబర్ నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,07,000 పాయింట్లకు చేరుకోవచ్చని మోర్గాన్ రిపోర్ట్ చెప్తోంది. ఇది ఇప్పటి సెన్సెక్స్ తో పోలిస్తే.. ఏకంగా 13 శాతం ఎక్కువ. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ముగిసే నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ మ్యాగ్జిమమ్ లెవల్లో 1,07,000 పాయింట్లు(Bull case), మినిమమ్ లెవల్లో 95,000 పాయింట్ల(Base case)కు చేరుతుందట. ఇప్పటి సెన్సెక్స్ తో పోలిస్తే సుమారు 13 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి చాలానే కారణాలు ఉన్నాయి.
కారణాలు ఇవే..
రకరకాల అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల వల్ల 2025లో భారత మార్కెట్ కాస్త వెనుకబడినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు బలంగా కోలుకోవడానికి సిద్ధంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. దీనికి దేశ ఆర్థిక విధానాలు, కంపెనీల ఆదాయం పెరగడం వంటి పలు కారణాలు దీనికి దోహదపడొచ్చని ఆ రిపోర్ట్ పేర్కొంది. వచ్చే ఎడాది భారతీయ కంపెనీల ఆదాయం మరింత పెరిగే అవకాశం కనిపించడంతోపాటు ప్రభుత్వ విధానాలు రిఫ్లేషన్ దిశగా మారుతున్నాయి. వాణిజ్య పరంగా కూడా భారత్ లో మెరుగైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వచ్చే ఎడాది స్టాక్ మార్కెట్ ను పరుగులు పెట్టించబోతున్నాయి అని మోర్గాన్ రిపోర్ట్ చెప్తోంది.
అంచనా ఇదీ..
2026లో భారతదేశం మళ్లీ తన పట్టును సాధించుకోనుందని మోర్గాన్ స్టా్న్లీ అంచనా వేస్తుంది. ఇప్పటివరకు భారత్ లో కొన్ని రకాల స్టాక్స్ కు మాత్రమే లాభపడే పరిస్థితులు ఉన్నాయి. ఇకపై స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా (Macro driven Trade) నడిచే మార్కెట్‌గా భారత్ మారబోతోందట. భారత్ లో ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌లు బలంగా ఉండటం, స్థూల దేశీయోత్పత్తి (Nominal GDP) సుమారు 10 నుంచి 11 శాతం వృద్ధి చెందడం వంటి అంశాల కారణంగా, 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో సెన్సెక్స్ కంపెనీల ఆదాయం ఏటా 18 నుంచి 20 శాతం పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ఇవి కూడా..
ఇకపోతే.. ఈ ఏడాది భారత్ లో విదేశీ పెట్టుబడిదారులు బాగా తగ్గాయి. దేశీయ పెట్టుబడులు పెరిగాయి. ఇది కూడా వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్ లాభాలను ప్రభావితం చేయనుంది. అలాగే ప్రపంచ ఇండెక్స్‌లలో భారత్ వెయిటేజీ స్థిరంగా పెరుగుతోంది. ఈ అంశాలన్నీ కలిసి ఇండియన్ స్టాక్ మార్కెట్ ను మరింత బలంగా మారుస్తున్నాయి. విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి. ఈ కారణాల వల్ల భారత మార్కెట్ బలంగా, నిలకడగా కొనసాగుతుందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications