IPO News: తొలిరోజు 61 శాతం లాభం.. రికార్డు బ్రేకింగ్ లిస్టింగ్ నమోదు చేసిన ఫిన్‌టెక్ ఐపీవో..
Mobikwik IPO: డిసెంబర్ నెల ఐపీవో ఇన్వెస్టర్లకు పెద్ద వరంగానే నిలిచిందని చెప్పుకోవచ్చు. అనేక మెయిన్ కేటగిరీ కంపెనీల ఐపీవోలు ఈనెలలోనే రావటంతో పాటు దాదాపు లిస్ట్ అయిన ప్రతి ఐపీవో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దీంతో ఎస్ఎమ్ఈ, మెయిన్ కేటగిరీలోని ఐపీవోలపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు. ఊహించని లాభాలను ఆస్వాధిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫిన్‌టెక్ కంపెనీ మెుబిక్విక్ కంపెనీ ఐపీవో గురించే. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మెయిన్ కేటగిరీలో వచ్చిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేర్లు లాభదాయకమైన అరంగేట్రాన్ని నమోదు చేశాయి. ప్రధానంగా కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి 61 శాతం ప్రీమియం ధర రూ.449 వద్ద అడుగుపెట్టగా, బీఎస్ఈలో ఒక్కో స్టాక్ 59 శాతం ప్రీమియం రేటు రూ.442.25 వద్ద జాబితా కావటంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే లిస్టింగ్ తర్వాత కూడా కంపెనీ షేర్లకు భారీగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ కొనసాగటంతో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 12 శాతం మేర లాభపడి రూ.496 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.572 కోట్లను విజయవంతంగా సమీకరించింది. అయితే కంపెనీ ఇందుకోసం 2.05 కోట్ల పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవో సాధారణ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు అందుబాటులో ఉంచబడింది. నేడు ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అడుగుపెట్టిన కంపెనీ షేర్లకు కంపెనీ ఇష్యూ ధరను రూ.265-279గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 53 షేర్లుగా ఉంచింది. దీంతో ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి రూ.14,787 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.257.40 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
ఐపీవో తర్వాత కంపెనీలో ప్రమోటర్లకు ఉన్న వాటా గతంలో 32.96% నుంచి ప్రస్తుతం 25.18 శాతానికి క్షీణించింది. 2008లో స్థాపించబడిన ఫిన్ టెక్ కంపెనీ ప్రీపెయిడ్ డిజిటల్ వాలెట్, ఆన్ లైన్ పేమెంట్స్ వంటి సేవలను తొలినాళ్లలో ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ తన యాప్ ద్వారా వినియోగదారులకు యుటిలిటీ బిల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, యూపీఐ చెల్లింపు సేవలు, మర్చంట్ పేమెంట్స్ సర్వీసులు, పేమెంట్ గేట్ వే సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ ఫైనాన్స్ సర్వీస్ వ్యాపారం, పేమెంట్ సర్వీస్ వ్యాపార వృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. అలాగే కొంత భాగాన్ని మూలధన అవసరాలకు, టెక్నాలజీపై వెచ్చించాలని చూస్తోంది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ వాస్తవానికి జూలై 2021లోనే తన ఐపీవోను ఫ్లోట్ చేయాలని తొలుత ప్లాన్ చేసినప్పటికీ మార్కెట్ అనుకూలంగా లేకపవటంతో వాయిదా వేసుకుంది.


Click it and Unblock the Notifications