Multibagger Stock: 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూ‎ట్‎లో లాక్ అయిన మల్టీబ్యాగర్ స్టాక్..

బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్‌ను ఉన్నప్పటికీ మల్టీబ్యాగర్ స్మాల్-క్యాప్ స్టాక్ అయిన మోబావెన్యూ ఏఐ టెక్ బుధవారం నాడు బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ సెషన్‌లో ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ దాదాపు 1 శాతం పడిపోయినప్పటికీ, కంపెనీ తన Q1FY27 పన్ను అనంతర లాభం (PAT)లో గతేడాదితో పోలిస్తే (YoY) 95% పెరుగుదలను నివేదించిన తర్వాత, మోబావెన్యూ ఏఐ టెక్ షేర్ ధర 10 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన రూ.338.50కి చేరుకుంది. ఆగస్టు 12న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మోబావెన్యూ ఏఐ టెక్ తెలిపిన ప్రకారం, దాని Q1FY27 పన్ను అనంతర లాభం (PAT) గతేడాదితో పోలిస్తే 95 శాతం పెరిగి రూ.11.7 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 57 శాతం పెరిగి రూ.72.8 కోట్లకు చేరింది.

పన్ను అనంతర మార్జిన్ గతేడాదితో పోలిస్తే 320 బేసిస్ పాయింట్లు పెరిగి 16.1 శాతానికి చేరింది. ఈ త్రైమాసికంలో ఎబిట్డా రూ.15.4 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ఎబిట్డా మార్జిన్ గతేడాదితో పోలిస్తే 240 బేసిస్ పాయింట్లు పెరిగి 21.2%కి చేరింది. క్విక్ కామర్స్, BFSI, ఫిన్‌టెక్, రిటైల్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలోని ప్రత్యక్ష ప్రకటనదారుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే కంపెనీ రీసెల్లర్, ఏజెన్సీ ఛానల్ ద్వారా గెలుచుకున్న గ్లోబల్ క్లయింట్ల నుంచి ఈ త్రైమాసికంలో వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది.

Multibagger

ఆదాయంలో 65.2% వాటా ప్రత్యక్ష క్లయింట్లదని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20.7% కాగా, FY2026లో ఇది 11.5%గా ఉంది. ఇందులో భారతదేశ వాటా 79.3%గా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ తన AI-ఆధారిత యాడ్‌టెక్, కన్స్యూమర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసే AI లేయర్ అయిన 'మొబావెన్యూ న్యూరల్ ఇంజిన్'ను ప్రారంభించింది. "మొబావెన్యూ న్యూరల్ ఇంజిన్ అనేది ప్రణాళిక, అమలు, సృజనాత్మకత, రిపోర్టింగ్ వంటి మొత్తం ప్రకటనల ప్రక్రియ అంతటా పనిచేసే ఒకే AI లేయరు. ఇది ఒక మార్కెటర్‌ను 59 సెకన్ల లోపు ప్రచార ప్రణాళిక నుంచి ప్రత్యక్ష ప్రచారానికి వెళ్లడానికి ఉపయోగపడుతుందని కంపెనీ వివరించింది.

రాబోయే త్రైమాసికాల్లో దీనిని కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లలో క్రమంగా పొందుపరుస్తామని పేర్కొంది. ఆగస్టు 12న మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి రూ.2,442 కోట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో 'మోబావెన్యూ ఏఐ టెక్ స్టాక్ ట్రేడవుతోంది. ఈ స్టాక్ గత మూడు సంవత్సరాల కాలంలో 3,900 శాతం ఐదేళ్లలో 13,944 శాతం మేర బలమైన రాబడులను అందించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 38% వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 21న రూ.196.90 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకిన ఈ స్టాక్, జూలై 8న రూ.343.80 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+