భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో (Meesho) తన అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP) ను భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI) వద్ద దాఖలు చేసింది. ఇది కంపెనీ పబ్లిక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి చేస్తున్న ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది. తాజా ఫైలింగ్ ప్రకారం మీషో IPOలో రూ. 4,250 కోట్ల వరకు విలువైన కొత్త ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు, 17.56 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంటుంది. ఇందులో ప్రస్తుత పెట్టుబడిదారులు, కంపెనీ సహ వ్యవస్థాపకులు తమ కొంత వాటాను విక్రయించనున్నారు.
OFSలో పాల్గొనే ప్రధాన షేర్ హోల్డర్లు ఎలివేషన్ క్యాపిటల్ V లిమిటెడ్, పీక్ XV పార్టనర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ V, వెంచర్ హైవే, Y కాంబినేటర్ కంటిన్యుటీ హోల్డింగ్స్, గోల్డెన్ సమ్మిట్ లిమిటెడ్ వంటి ప్రముఖ వెంచర్ ఇన్వెస్టర్లు ఉన్నారు. అదేవిధంగా సహ వ్యవస్థాపకులు విదిత్ ఆత్రే, సంజీవ్ కుమార్ కలిపి 2.35 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. అయితే ఇది వారి మొత్తం హోల్డింగ్స్‌లో చిన్న భాగమే.

ఎలివేషన్ క్యాపిటల్, పీక్ XV ఈ సెకండరీ అమ్మకానికి నాయకత్వం వహిస్తున్నాయి. వీరు వరుసగా రూ. 5.54 కోట్లు, రూ. 3 కోట్లు విలువైన షేర్లు విక్రయించనున్నారు. మరోవైపు ప్రోసస్ (12.34%) సాఫ్ట్‌బ్యాంక్ (9.31%) వంటి ప్రముఖ పెట్టుబడిదారులు తమ వాటాలను నిలుపుకుంటారు.
కంపెనీ రూ. 850 కోట్ల ప్రీ-IPO ప్లేస్‌మెంట్ కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇది జరిగితే కొత్త ఇష్యూ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. IPO ద్వారా లభించే నిధులను క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, AI & ML బృందాల విస్తరణ, మార్కెటింగ్, బ్రాండ్ క్యాంపెయిన్ల బలోపేతం కోసం వినియోగించనున్నారు. అలాగే అధిగ్రహణాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా వృద్ధి కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
2025 ఆర్థిక సంవత్సరంలో మేషో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం ఇది భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ గా ఎదిగింది. 5 లక్షలకుపైగా విక్రేతలను దాదాపు 199 మిలియన్ల వినియోగదారులతో అనుసంధానించి 1.8 బిలియన్ ఆర్డర్లను సులభతరం చేసింది. నగదు ప్రవాహ పరంగా కూడా కంపెనీ గణనీయమైన మార్పు చూపించింది. గత సంవత్సరం రూ. 2,336 కోట్ల నష్టంతో పోలిస్తే, FY25లో రూ. 1,032 కోట్ల పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోను నమోదు చేసింది. పన్నుకు ముందు నష్టం FY23లో రూ. 1,672 కోట్ల నుండి FY25లో కేవలం రూ. 108 కోట్లకు తగ్గింది.
అయితే FY25లో కంపెనీకి రూ. 3,942 కోట్ల నికర నష్టం నమోదైంది, ఇది ప్రధానంగా పునర్ నిర్మాణ ఖర్చుల కారణంగా ఏర్పడింది. అయినప్పటికీ, మేషో వృద్ధిలో పెట్టుబడులు కొనసాగిస్తోంది. FY26 మొదటి త్రైమాసికంలో దాని నికర వస్తువుల విలువ (NMV) సంవత్సరానికి 36 శాతం పెరుగుదలగా ఉంది. ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల నమోదైంది. ఇది వినియోగదారుల, విక్రేతల విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఈ IPOను కోటక్ మహీంద్రా క్యాపిటల్, JP మోర్గాన్ ఇండియా*, మోర్గాన్ స్టాన్లీ ఇండియా,యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు నిర్వహించనున్నాయి. నివేదికల ప్రకారం, మీషో డిసెంబర్ 2025లో దేశీయ లిస్టింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతున్న ఈ స్టార్టప్, ఈ సంవత్సరం IPOలకు సిద్ధమవుతున్న Groww, Razorpay, Wakefit.co, Lenskart వంటి ఇతర భారత స్టార్టప్‌లతో ఒకే బాటలో నడుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications