2025 సెప్టెంబర్ 10 బుధవారం నాగు స్టాక్ మార్కెట్లో భారతీయ టెక్స్‌టైల్ రంగాల షేర్లు దూసుకుపోయాయి. వెల్‌స్పన్ లివింగ్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, పెర్ల్ గ్లోబల్, అలోక్ ఇండస్ట్రీస్, ట్రైడెంట్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు 9 శాతం వరకు పెరిగాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణం భారతదేశం - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు చిగురించడమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ ద్వారా తమ మంచి స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించడంతో ఈ రంగాలకు స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది
వెల్‌స్పన్ లివింగ్ షేర్లు దాదాపు 9 శాతం పైగా పెరగగా.. గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, ట్రైడెంట్ షేర్లు 7 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. వర్ధమాన్ టెక్స్‌టైల్స్ 6 శాతం, పెర్ల్ గ్లోబల్ 5 శాతం మధ్య పెరుగుదల నమోదు చేసింది.ఇక ఫేజ్ త్రీ లిమిటెడ్ షేర్లు కూడా ఆశాజనకంగా పెరిగాయి. కంపెనీ స్టాక్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. కాగా గత 20 రోజుల్లో గరిష్టంగా 31వేల షేర్లు మాత్రమే లావాదేవీలు జరిగగా.. ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లోని మొదటి గంటలో ఈ కంపెనీ ఒక్కదానివే 6.5 లక్షల షేర్లు చేతులు మారాయి.

అమెరికా 25 శాతం అదనపు సుంకాన్ని భారతదేశం నుండి చమురు ఎగుమతులపై విధించడంతో, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిలిచిపోయిన సంగతి విదితమే. GTRI నివేదిక ప్రకారం, ఈ సుంకం భారతదేశ ఎగుమతులలో సుమారు 66 శాతం వరకు ప్రభావం చూపబోతుంది, ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఆహారాలు ఆభరణాల రంగాలలో సుంకాలు భారీగా ఉండే అవకాశం ఉంది.ఈ అధిక సుంకాలు కొనసాగితే సుమారు 6 బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులు కోల్పోవచ్చని పెర్ల్ గ్లోబల్ యాజమాన్యం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక గత నెలలో టెక్స్‌టైల్ స్టాక్‌లు భారీగా పడిపోయినప్పటికీ.. ఈ రోజు మళ్లీ ఊపందుకున్నాయి. వెల్‌స్పన్ లివింగ్ షేర్లు రూ. 124.55కి చేరగా, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ రూ. 802.15కి పెరిగాయి. ట్రైడెంట్ లిమిటెడ్ కూడా 4 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. భారతీయ టెక్స్‌టైల్ రంగం ప్రపంచ మార్కెట్ల కష్టాలను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ, వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి. దేశంలోని చాలా వస్త్ర కంపెనీలు తమ ఆదాయంలో 50 శాతం నుండి 70 శాతం వరకు అమెరికా మార్కెట్ నుండే సంపాదిస్తాయి. కాబట్టి Trade deal ఎలాంటి తీరాలకు చేరుతుందో చూడాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications