Tilaknagar Industries Shares: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక లిక్కర్ కంపెనీకి చెందిన షేర్లు ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షిస్తున్నాయి. అయితే పెట్టుబడిదారులు ఒక్కసారిగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లపై ఎగబడటానికి రెండు కారణాలు ఉన్నాయి.
ముందుగా కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించటంతో పాటు మరో ప్రకటన చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, ప్రపంచంలో రెండవ అతిపెద్ద లిక్కర్ బ్రాండ్ మాన్షన్ హౌస్ బ్రాందీని తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కంపెనీ పూర్తిగా తన రుణాలను చెల్లించినట్లు ప్రకటన వెలువడటంతో షేర్ల కొనుగోలుకు హడావిడి పెరిగింది. దీంతో నేడు ఇంట్రాడేలో స్టాక్ ధర 18 శాతం పెరుగుదలను చూసింది. దీంతో నేడు కంపెనీ షేర్లు తమ సరికొత్త గరిష్ఠ ధర రూ.345కి చేరుకుంది.

కంపెనీ తాజాగా తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఆదాయం రూ.823.3 కోట్లుగా నివేదించింది. ఇది ఏడాది ప్రతిపధికన 23.8 శాతం వృద్ధిని సారించింది. క్యూ2లో కంపెనీ అత్యధిక త్రైమాసిక EBITDA రూ.66 కోట్లను సాధించింది. అలాగే పన్ను తర్వాత లాభం రూ.58 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఫైనాన్స్ ఖర్చుల కారణంగా లాభాలు ఏడాది ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో 82 శాతం వృద్ధిని సాధించగలిగింది. ఇక్కడ పెట్టుబడిదారులను ఇంప్రెస్ చేస్తున్న ముఖ్యమైన విషయం త్రైమాసికంలో రూ. 25 కోట్ల నికర నగదుతో కంపెనీ నికర రుణ రహితంగా మారటమే.
ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాందీ విభాగంలో కంపెనీ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. మెుత్తం విక్రయాల్లో దీని వాటా ఏకంగా 93 శాతంగా ఉంది. అలాగే మెుత్తం ఈ కేటగిరీలో కంపెనీకి 20 శాతం మార్కెట్ వాటా ఉండటం గమనార్హం. కంపెనీ క్యూ2లో సెమీ ప్రీమియం విభాగంలో అస్సాంలో మాన్షన్ హౌస్ విస్కీని ప్రారంభించింది. ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ తెలంగాణ, కర్నాటకలోని P&A IMFL విభాగంలో మూడవ అతిపెద్ద ప్లేయర్‌గా కొనసాగుతోందని తేలింది. ఇదే క్రమంలో పుదుచ్చేరిలో అతిపెద్ద IMFL ప్లేయర్‌గా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు అత్యధికంగా 2290 శాతం కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు. ఐదేళ్ల కిందట స్టాక్ ధర ఒక్కోటి రూ.13 వద్ధ ఉండగా నేడు ఇంట్రాడేలో 12.40 గంటల సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.343.70గా ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6630 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications