Mankind Pharma: భారీగా పెరిగిన మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు.. నాలుగు సెషన్లలో 10 శాతం రాబడి..!
బలహీనమైన స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ సెప్టెంబర్ 22 మంగళవారం నాడు బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా షేరు ధర దాని మునుపటి ముగింపు ధర అయిన రూ.2,429.85తో పోలిస్తే ₹2,445.60 వద్ద ప్రారంభమై, 2.1% పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన రూ.2,481కి చేరుకుంది. ఇది వరుసగా నాలుగో సెషన్‌లోనూ పెరుగుదలను నమోదు చేసింది. మ్యాన్‌కైండ్ ఫార్మా స్టాక్ కేవలం నాలుగు సెషన్లలోనే 10.4% లాభపడింది. సుదీర్ఘ పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం తర్వాత కంపెనీ యొక్క ప్రధాన దేశీయ వ్యాపారంలో పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ మ్యాన్‌కైండ్ ఫార్మాకు యాడ్ నుంచి బై రేటింగ్ అప్‌గ్రేడ్ చేసింది. టార్గెట్ ప్రైస్ ను రూ.2,885 నుంచి రూ.3,000కి పెంచింది.
క్షేత్రస్థాయి సిబ్బంది స్థిరత్వం, పరిశోధన, అభివృద్ధిలో పురోగతి కారణంగా కంపెనీ కొత్త ఉత్పత్తుల విడుదల, అమ్మకాల పరిమాణం పుంజుకుంటాయని కోటక్ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ 12 శాతం పడిపోగా మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్ ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి 14 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 23 శాతం లాభాన్ని నమోదు చేసింది. నెలవారీగా చూస్తే, సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఇది దాదాపు 3 శాతం పెరిగింది. గత FY27 జూన్ త్రైమాసికంలో మ్యాన్‌కైండ్ ఫార్మా తన ఆదాయంలో 12.9% వృద్ధిని సాధించి రూ.4,031 కోట్లకు పెరిగింది.

నికర లాభం 29.1% పెరిగి రూ.574 కోట్లకు చేరింది. ఎబిట్డా 24.7% వృద్ధితో రూ.1,060 కోట్లకు చేరగా మార్జిన్ 250 బేసిస్ పాయింట్లు పెరిగి 26.3%కి విస్తరించింది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSVL) స్వచ్ఛంద లిక్విడేషన్ ద్వారా దాని వ్యాపారాన్ని మ్యాన్‌కైండ్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఆగస్టు 26న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన సమాచారంలో BSVL వ్యాపారాన్ని తమ కంపెనీలో వేగంగా విలీనం చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారని మ్యాన్ కైండ్ ఫార్మా పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
