IPO News: అమ్మతోడు అడ్డంగా ముంచేసిన ఐపీవో.. ఎగబడి అమ్మేస్తున్న ఐపీవోపై బెట్ వేశారా..?

Mangal Compusolution IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల కోలాహలం తిరిగి కొనసాగుతోంది. మార్కెట్ల పతనంలో కొన్ని కంపెనీల ఐపీవోలు సైతం తొలిరోజు నుంచే పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో తెలివైన ఇన్వెస్టర్లు అలా లిస్ట్ కాగానే ఇలా షేర్లను అమ్మేస్తూ వచ్చినకాడికి లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకుంటున్న తీరు కొత్త ఇన్వెస్టర్లను హడావిడికి గురిచేస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మంగళ్ కంప్యూషన్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీకిలో కంపెనీ షేర్లు నేడు లిస్ట్ అయ్యాయి. కంపెనీ షేర్లు ఇష్యూ ధరకే ఒక్కోటి రూ.45 వద్ద ఫ్లాట్ లిస్టింగ్ చూశాయి. బీఎస్ఈలో లాభాలు లేకుండా లిస్ట్ అయిన కంపెనీ షేర్లు కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు నష్టాలను రుచి చూపించాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.42.75 వద్ద కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇష్యూలో షేర్లు దక్కించుకున్న పెట్టుబడిదారులు వాటిని విక్రయించేందుకు పోటీ పడుతున్నారు. పైగా లిస్టింగ్ సమయంలో ఎలాంటి లాభాలు రాకపోవటంతో చాలా మంది నిరాశలో ఉన్నారు.

Mangal Compusolution IPO in Shock as after flat listing locked in lower circuit Investors shocked

వాస్తవానికి కంపెనీ ఐపీవో నవంబర్ 12న రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అందుబాటులోకి వచ్చింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నవంబర్ 14 వరకు బెట్టింగ్ వేసేందుకు పెట్టుబడిదారులకు అవకాశాన్ని కల్పించింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.16.23 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవో పూర్తిగా 30.06 లక్షల తాజా షేర్ల జారీతో జరిగింది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో సమయంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.45గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 3000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1.35 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. తాజా ఐపీవో తర్వాత కంపెనీ ప్రమోటర్లకు కంపెనీలో ఉన్న వాటా 100 శాతం నుంచి 73.50 శాతానికి తగ్గింది. ప్రస్తుతం కంపెనీకి హార్దిక్ మేఘరాజ్ జైన్, నీతా ముఖేష్ దేశాయ్, పతిక్ ముఖేష్ దేశాయ్, ముఖేష్ ఖండూభాయ్ దేశాయ్, శ్రీమతి బిన్నీ పాథిక్ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.

కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే ఏప్రిల్ 2011లో స్థాపించబడింది. కంపెనీ రెంటల్ ప్రాతిపదికన హార్డ్ వేర్ సొల్యూషన్స్ అందిస్తోంది. దేశంలోని అనేక రంగాల్లో పనిచేస్తున్న పరిశ్రమలకు ఈ సేవలను కంపెనీ అందించే పనిలో ఉంది. క్లయింట్‌ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సర్వర్లు, ఇతర పరికరాలతో సహా అనుకూలీకరించదగిన ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులతో చిన్న పెద్ద సంస్థలకు సేవలను అందిస్తోంది. కంపెనీకి ప్రధానంగా కస్టమర్లు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్నట్లు వెల్లడైంది. కంపెనీ వీటిని అద్దెకు ఇవ్వటం ద్వారా ప్రధానంగా ఆదాయాన్ని పొందుతోంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+