IPO News: గ్రేమార్కెట్లో ఐపీవో సంచలనం.. బెట్టింగ్‌కి మంగళవారం ఓపెనింగ్, డబ్బు సిద్ధం చేస్కోండి!

Malpani Pipes IPO: వారాలు మారుతూనే ఉన్నప్పటికీ కొత్త ఐపీవోల రాక మాత్రం కొనసాగుతూనే ఉంది. రేపటి నుంచి కొత్త వారం ప్రారంభం అవుతున్న వేళ కొత్త ఐపీవోలపై బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లు కూడా దీనికి సంబంధించిన వివరాల కోసం వెతుకుతున్నారు. మార్కెట్ల ఒడిదొడుకుల్లో ఐపీవోల నుంచి లిస్టింగ్ గెయిన్స్ సంపాదించాలనుకుంటున్న వారి కోసమే ఈ వివరాలు..

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మల్పానీ పైప్స్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీవో రానున్న వారంలో ఇష్యూని ప్రారంభించాలని చూస్తోంది. అయితే ఇప్పటికే గ్రేమార్కెట్లో కంపెనీ ఒక్కో షేరుకు రూ.25 ప్రీమియం ధర పలుకుతోంది. కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.25.92 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 28.80 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫిబ్రవరి 5న ఐపీవో మార్కెట్లో జాబితా కానుందని తెలుస్తోంది.

Malpani Pipes IPO shares trading with 25 GMP even before opening for Subscription Know details

వాస్తవానికి కంపెనీ ఐపీవో రిటైల్ పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం జనవరి 29న తెరచుకోనుంది. బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్లకు జనవరి 31 వరకు అవకాశం కల్పించబడుతోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.85-90గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం లాట్ కొనుగోలు కోసం రూ.1.44 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 100 శాతం వాటాను కలిగి ఉండగా ఐపీవో తర్వాత అది 73.28 శాతానికి తగ్గనుందని తెలుస్తోంది.

లిస్టింగ్ రోజు వరకు ప్రస్తుతం ఉన్న గ్రేమార్కెట్ ప్రీమియం కొనసాగితే స్టాక్ మెుదటి రోజున రూ.115 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ రిటైల్ పెట్టుబడిదారులకు ఐపీవోలో 35 శాతం, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కేటగిరీకి 50 శాతం షేర్లను ఐపీవోలో రిజర్వు చేసిందని తెలుస్తోంది.

కంపెనీ వ్యాపారం..
2017లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా హై క్వాలిటీ ప్లాస్టిక్ పైపుల తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. కంపెనీ హై-డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) పైపులు, మీడియం-డెన్సిటీ పాలిథిలిన్ (MDPE) పైపులు, లీనియర్ లో-డెన్సిటీ పాలిథిలిన్ (LLDPE) పైపుల తయారీలో ఉంది. కంపెనీ తన ఉత్పత్తులను "Volstar" బ్రాండ్ పేరుమీద మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తోంది.

పైపులు నీటిపారుదల, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, డ్రైనేజీ, బోర్‌హోల్స్, ట్యూబ్ వెల్స్, విద్యుత్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ సంస్థాపనలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూపొందిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాన్ని మధ్యప్రదేశ్ రాట్లంలో కలిగి ఉంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+