Laxmi Dental IPO: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఐపీవోల్లో ఒకటి రెండు ఇన్వెస్టర్లను నిరాశ పరిచినప్పటికీ మిగిలినవి భారీగానే లిస్టింగ్ గెయిన్స్ పెట్టుబడిదారులకు అందించాయి. ఈ క్రమంలో కొత్త వారంలో కూడా ఇన్వెస్టర్లు ఓలటైల్ మార్కెట్లను నమ్ముకోవటం కంటే ఐపీవోలపై బెట్టింగ్ మంచి రాబడులను ఇవొచ్చని భావిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది లక్ష్మీ డెంటల్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో ఈవారం ఐపీవో ఇష్యూను ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. తాజా ఐపీవో ద్వారా రూ.698.06 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో 560.06 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ ఉండగా మిగిలిన దానికోసం కంపెనీ తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. కంపెనీ ఐపీవో పెట్టుబడిదారులకు జనవరి 13 నుంచి జనవరి 15 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.407-428గా నిర్ణయించింది. కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 33 షేర్లుగా నిర్ణయించటంతో ఒక లాట్ కొనుగోలు చేయటానికి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.14,124 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. తాజాగా కంపెనీ ఒక రోజు ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.314.13 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ప్రాధమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో లిస్టింగ్ జనవరి 20, 2025న జరగనుందని తెలుస్తోంది. ఐపీవోకి ప్రారంభానికి ముందుగానే గ్రేమార్కెట్లో షేర్లకు భారీ స్పందన కనిపిస్తోంది.
ఒక్కో షేరుపై గ్రేమార్కెట్లో ప్రీమియం రూ.160 పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే రూ.588 రేటు వద్ద కంపెనీ షేర్లు ఒక్కోటి జాబితా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజేష్ వ్రజ్లాల్ ఖాఖర్, సమీర్ కమలేష్ వ్యాపారి, ధర్మేష్ భూపేంద్ర దత్తాని ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా కొనసాగుతున్నారు. వీరికి ఐపీవోకి ముందు కంపెనీలో మెుత్తం 46.56 శాతం వాటా మాత్రమే ఉంది.
కంపెనీ వ్యాపారం..
2004లో స్థాపించబడిన లక్ష్మీ డెంటల్ లిమిటెడ్ ఒక ఇంటిగ్రేటెడ్ డెంటల్ ఉత్పత్తుల సంస్థగా ఉంది. కస్టమ్ క్రౌన్లు, బ్రిడ్జిలు, క్లియర్ అలైనర్లు, థర్మోఫార్మింగ్ షీట్లు వంటి బ్రాండెడ్ డెంటల్ వస్తువులు, దాని అలైనర్ సొల్యూషన్స్‌లో భాగంగా అలైనర్-సంబంధిత ఉత్పత్తులు, పీడియాట్రిక్ డెంటల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే కంపెనీ థర్మోఫార్మింగ్ షీట్లు, బయో కాంపాజిబుల్ 3D ప్రింటింగ్ రెసిన్లు, టాగ్లస్ బ్రాండ్ పేరుతో క్లియర్ అలైనర్‌లను తయారు చేయడానికి యంత్రాలను అందిస్తోంది. కంపెనీ డిజైన్ నుంచి ఉత్పత్తుల పంపిణీ వరకు మెుత్తం వ్యాపార ప్రక్రియను కొనసాగిస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications