Multibagger Stock: ఒక్క రోజే 20 శాతం పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
మంగళవారం లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ లిమిటెడ్ భారీగా లాభపడింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ నేటి ట్రేడింగ్ సెషన్ లో 20 శాతం పెరిగింది. దీంతో 52 వారాల కనిష్ట స్థాయి నుంచి భారీగా పెరిగింది. ఈ స్టాక్ ఇటీవలి కాలంలో 110 శాతం రాబడి ఇచ్చింది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ అయిన ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కంపెనీ నికర లాభం (PAT) గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.54 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ. 99 కోట్లకు చేరింది. అంటే 83 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు సాంకేతికంగా నడిచే కార్యాచరణ నైపుణ్యం మెరుగైన ఆస్తుల వినియోగం కారణమని లుమాక్స్ పేర్కొంది.
ప్రధాన ఉత్పత్తి విభాగాలలో విస్తరణ, OEMలతో వాలెట్ షేర్‌ను పెంచుకోవడం, ప్రీమియమైజేషన్-ఆధారిత విలువ పెంపుదల కారణంగా, ఈ త్రైమాసికంలో తమ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 33 శాతం పెరిగి రూ. 1,026 కోట్ల నుంచి రూ. 1,364 కోట్లకు చేరుకుందని లుమాక్స్ ప్రకటించింది. కార్యాచరణ సామర్థ్యాలు, వ్యయ ఆప్టిమైజేషన్, అనుకూలమైన ఉత్పత్తి కారణంగా EBITDA గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగి రూ. 205 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో మార్జిన్ 13.2 శాతం నుంచి 15.1 శాతానికి పెరిగింది. ఈ తాజా ర్యాలీతో లూమాక్స్ షేర్లు ఏడాది క్రితం నమోదైన రూ. 991 వద్ద ఉన్న 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 110 శాతం పెరిగాయి.

ఆటోమోటివ్ పరిశ్రమ FY27కు బలమైన ప్రారంభాన్ని ఇచ్చిందని, ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 22 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిందని లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ జైన్ చెప్పారు. వాహనాలలో కొనసాగుతున్న ప్రీమియంకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం పెరగడం, ప్రతి వాహనంలో విడిభాగాల సంఖ్య అధికమవడం వంటివి ఆటో విడిభాగాల తయారీదారులకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తున్నాయని జైన్ తెలిపారు.
లుమాక్స్‌లో నిరంతర ఆవిష్కరణలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా పరిశ్రమ పోకడల కంటే ముందుండటంపై మేము దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ఉన్న వినియోగదారులతో తమ వాటాని బలోపేతం చేసుకోవడానికి, కొత్త వాహన ప్లాట్‌ఫారమ్‌లలో తమ ఉనికిని విస్తరించడానికి, వివిధ ప్రాంతాలలో కొత్త వినియోగదారులను చేర్చుకోవడానికి, మా ఉత్పత్తి శ్రేణిని మరింత మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications