Market Holiday 2024: గడచిన వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. అయితే వరుసుగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి బెంచ్ మార్క్ సూచీలు రికార్డు స్థాయిలో పతనం కావటం దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో స్టార్ట్ అయ్యాయి. చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే రేపు దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా లేక సెలవులో ఉంటాయా అన్నదే. వాస్తవానికి నేడు మార్కెట్లో విక్లీ ఆప్షన్స్ ఎక్స్ పెయిరీ ఉంటుంది. అయితే రేపు గురునానక్ జయంతి కారణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ట్రేడింగ్ నిలిచిపోనుంది. స్టాక్ మార్కెట్ల సెలవుల జాబితాలో రేపు అంటే నవంబర్ 15, 2024 సెలవుగా నిర్ణయించబడింది. అందువల్ల వాస్తవానికి శుక్రవారం మార్కెట్లు ఆపరేటింగ్ లో ఉండాల్సినప్పటికీ.. పండుగ సందర్భంగా సెలవు ప్రకటించటం జరిగింది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. లాంగ్ పొజిషన్లు తీసుకునే ముందు వారాంతంలో వరుస సెలవుల గురించి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.

నవంబర్ మాసంలో ఒకటో తారీఖు దీపావళి సందర్భంగా సెలవు ఉండగా.. దీని తర్వాత మరో సెలవు గురునానక్ జయంతి కోసం రేపు అందించబడింది. దీని తర్వాత స్టాక్ మార్కెట్లు ఏడాది చివరి మాసం డిసెంబరులో క్రిస్టమస్ కారణంగా 25వ తేదీన సెలవులో ఉంటుందని స్టాక్ మార్కెట్ల సెలవు క్యాలెండర్ ప్రకారం వెల్లడైంది. ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకొని తమ ట్రేడింగ్ ప్లానింగ్ చేసుకోవటం ఉత్తమంగా నిపుణులు సూచిస్తున్నారు.
ఇక నేడు ఇంట్రాడేలో దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరును గమనిస్తే.. బెంచ్ మార్క్ సూచీలు వరుస నష్టాలతో 5 నెలల గరిష్ఠాన్ని తాకిన సంగతి తెలిసిందే. కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ మార్కెట్లు బేర్స్ చేతిలో చిక్కుకున్నాయి. అయితే నేడు వరుస నష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీలు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సెప్టెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలు నిరాశకు గురిచేయటంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిరంతరాయందా అమ్మకాలకు దిగుతూ తమ డబ్బును మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకోవటంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ప్రస్తుతం స్వల్పంగా లాభాలతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ.. సమీపకాలంలో తిరిగి నష్టాల్లోకి జారుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
నేడు ఉదయం 9.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 299 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 135 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications