LIC: టాటా గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులు రూ.లక్ష కోట్లకు చేరాయి..!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) టాటా గ్రూప్ కంపెనీలలో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంది. టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలలో LIC పెట్టుబడి విలువ రూ. 1 లక్ష కోట్లకు పైగా చేరింది. చంద్రశేఖరన్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే, జూన్ 2022 నుంచి టాటా గ్రూప్ ప్రమోట్ చేసిన 14 లిస్టెడ్ కంపెనీలలో 10 కంపెనీలలో LIC వాటా పెరిగిందని ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. చంద్రశేఖరన్ కొనసాగింపు, హోల్డింగ్ కంపెనీ లిస్టింగ్ అవకాశం, గ్రూప్ భవిష్యత్ వ్యూహాత్మక దిశపై టాటా సన్స్‌లో అపూర్వమైన పాలనా ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో, టాటా గ్రూప్ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల పెరుగుదల ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
టాటా సన్స్ బోర్డు మరో ఐదేళ్ల పదవీకాలానికి చంద్రశేఖరన్‌కు మద్దతు ఇవ్వగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా వ్యతిరేకించారు. మరోవైపు ఈ నిర్ణయం చెల్లుబాటును ట్రస్ట్‌లు ప్రశ్నించాయి. ఛైర్మన్‌గా కొనసాగడానికి చంద్రశేఖరన్‌ను డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి, అంతిమంగా వాటాదారుల ఆమోదం అవసరం. టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, నిర్ణయాత్మక ఓటు వేయవచ్చు. ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాలకు మూలధన కేటాయింపులపై, అలాగే తమ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకునేందుకు టాటా సన్స్ చేసిన దరఖాస్తును ఆర్‌బిఐ తిరస్కరించింది.

నాయకత్వంలో లేదా వ్యూహాత్మకంగా ఏదైనా అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగితే అది టాటా గ్రూప్ పబ్లిక్ మార్కెట్ పెట్టుబడిదారులపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. శాతం పరంగా చూస్తే, 2022 తర్వాత టాటా ఎల్క్సీలో LIC పెట్టుబడులు అత్యధికంగా పెరిగాయి. జూన్ 2022 నాటికి కంపెనీలో 1.04 శాతంగా ఉన్న LIC వాటా, ఇప్పుడు 6.59 శాతానికి పెరిగింది. 2020, 2022 మధ్య, టాటా ఎల్క్సీ అద్భుతమైన వృద్ధిని సాధించింది. దీని షేరు ధర ఏప్రిల్ 2020లో ఒక్కో షేరుకు రూ. 713 నుంచి 10 రెట్లకు పైగా పెరిగి, ఆగస్టు 2022 నాటికి జీవితకాల గరిష్ట స్థాయి అయిన రూ. 10,238కి చేరుకుంది.
అయితే ఈ ర్యాలీ తర్వాతే LIC ఈ స్టాక్‌లోకి ప్రధానంగా ప్రవేశించినట్లు కనిపిస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం, ఆగస్టు 2022 నుంచి ఈ షేర్ల విలువ మూడింట ఒక వంతుకు పడిపోయింది. సెప్టెంబర్ 18 నాటికి ఒక్కో షేరు ధర రూ. 3,333 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటాకు చెందిన రిటైల్ బ్రాండ్ 'ట్రెంట్' (Trent)లో కూడా ఎల్ఐసీ కొత్తగా పెట్టుబడులు పెట్టింది. జూన్ 2022లో 0 శాతంగా ఉన్న ఈ బీమా సంస్థ వాటా ప్రస్తుతం 3 శాతానికి పైగా పెరిగింది. ఆగస్టు 2020, అక్టోబర్ 2024 మధ్య మార్కెట్‌లో ట్రెంట్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో దాని షేరు ధర 10 రెట్లకు పైగా పెరిగి రూ. 5,200 అనే గరిష్ట స్థాయిని తాకింది.
కేవలం ట్రెంట్ మాత్రమే కాకుండా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో కూడా ఎస్ఐసీ వాటా దాదాపు 3 శాతం పెరిగింది. ప్రస్తుతం ఆ కంపెనీలో ఎల్ఐసీకి 8.23 శాతం వాటా ఉంది. టాటా కెమికల్స్ లో ఎల్ఐసీ వాటా జూన్ 2022 నాటి 6.79 శాతం నుంచి ప్రస్తుతం 9.24 శాతానికి పెరిగింది. సాధారణంగా ఒక సంస్థాగత పెట్టుబడిదారుగా ఏదైనా లిస్టెడ్ కంపెనీలో గరిష్టంగా 10 శాతం వరకు వాటాను కలిగి ఉండటానికి బీమా నిబంధనలు అనుమతిస్తాయి. టాటా గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి టీసీఎస్ లో. ఇందులో ఉన్న 5.52 శాతం వాటా విలువ రూ. 41,960 కోట్లుగా ఉంది. విలువ పరంగా టాటా స్టీల్ రెండవ స్థానంలో ఉంది. ఎల్ఐసీ వాటాలో పెరుగుదల నమోదు చేయని నాలుగు కంపెనీలలో టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టైటాన్ ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స్ విషయానికొస్తే, జూన్ 2022 నాటికి LICకి 3.37 శాతం వాటా ఉండేది కానీ ఇప్పుడు అది 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
