ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ అనేక ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా ఐటీ రంగం అతలాకుతలం అవుతోంది. ఈ వారంలో ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఆంత్రోపిక్ తీసుకువచ్చిన కొత్త టూల్ ఐటీ కంపెనీల పాలిట శాపంలా మారింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ఐటీ మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అయింది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, అమెరికా వడ్డీ రేట్లపై ఆందోళనలు, కొత్త టెక్నాలజీల వల్ల వచ్చే పోటీ భయాలతో ఐటీ రంగం గరిష్ట స్థాయి నుంచి సుమారు 30 శాతం వరకు పడిపోయింది.
ఈ పరిస్థితుల్లో చాలా మంది రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులు IT షేర్లలో అమ్మకాలకు మొగ్గుచూపారు. అయితే, దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మాత్రం మార్కెట్ ట్రెండ్‌కు విరుద్ధంగా నడిచి.. ఐటీ స్టాక్స్‌లో దూకుడుగా పెట్టుబడులు పెట్టింది.ప్రస్తుతం LIC పోర్ట్‌ఫోలియోలో మొత్తం 283 స్టాక్స్ ఉండగా.. వాటి మార్కెట్ విలువ సుమారు రూ. 17.83 లక్షల కోట్లుగా ఉంది.

ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ త్రైమాసికంలో LIC అత్యధికంగా కొనుగోలు చేసిన ఐటీ స్టాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఈ కాలంలో LIC సుమారు రూ. 3,136 కోట్ల విలువైన TCS షేర్లను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లో రూ. 2,293 కోట్ల పెట్టుబడి పెట్టగా.. మధ్యస్థాయి ఐటీ కంపెనీ అయిన కోఫోర్జ్ ను కొత్తగా తన పోర్ట్‌ఫోలియోలో చేర్చింది.
ఈ కొనుగోళ్ల ప్రభావంతో LIC ఐటీ రంగ హోల్డింగ్స్ విలువ రూ. 1.82 లక్షల కోట్ల నుంచి రూ. 2.17 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీ స్టాక్స్ పడిపోయినప్పటికీ.. మొత్తం LIC పోర్ట్‌ఫోలియోలో ఐటీ రంగ వాటా 11.32 శాతం నుంచి 12.43 శాతానికి పెరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా AI రంగంలో వచ్చిన కొత్త పరిణామాలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి కంపెనీల తాజా సాధనాలు ఐటీ స్టాక్స్‌పై కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో LIC దీర్ఘకాలిక దృష్టితో ఐటీ రంగంపై విశ్వాసం చూపించినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఐటీ స్టాక్స్ కొనుగోళ్లకు భిన్నంగా LIC.. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలకు మొగ్గుచూపింది. డిసెంబర్ త్రైమాసికంలో LIC సుమారు రూ. 3,080 కోట్ల విలువైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లను విక్రయించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో రూ. 1,528 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 1,173 కోట్ల విలువైన షేర్లను అమ్మింది. ఫలితంగా LIC పోర్ట్‌ఫోలియోలో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ వాటా 27.21 శాతం నుంచి 26.52 శాతానికి తగ్గింది. అయినప్పటికీ రూ. 4.64 లక్షల కోట్ల విలువతో ఇదే రంగం LICకి అతిపెద్ద రంగ కేటాయింపుగా కొనసాగుతోంది.
ఇతర రంగాల్లోనూ LIC కొన్ని కీలక మార్పులు చేసింది. లార్సెన్ అండ్ టూబ్రోలో రూ. 2,442 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో రూ. 2,367 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. అలాగే హిందాల్కో ఇండస్ట్రీస్,వేదాంత,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL)లో తన వాటాను తగ్గించింది. మరోవైపు NDMC, వోల్టాస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆస్ట్రల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, JSW ఎనర్జీ వంటి కంపెనీల్లో వాటాను పెంచుకుంది.
అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. కోఫోర్జ్‌లో LIC పెట్టుబడి. సెప్టెంబర్ త్రైమాసికంలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న LIC వాటా, డిసెంబర్ నాటికి 4.66 శాతానికి పెరిగింది. ఈ స్టాక్ కూడా 52 వారాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 30 శాతం పడిపోయినప్పటికీ.. LIC దీన్ని అవకాశంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే LIC తాజా పోర్ట్‌ఫోలియో మార్పులు ఐటీ రంగంపై దీర్ఘకాలిక విశ్వాసం, బ్యాంకింగ్ రంగంపై కొంత జాగ్రత్తను స్పష్టంగా సూచిస్తున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications