IPO News: గత ఐపీవో రికార్డులను బద్ధలు కొట్టడానికి వస్తున్న కంపెనీ.. బెట్టింగ్‌కి గెట్ రెడీ..
LG Electronics IPO: కొత్త నెలలో ఐపీవోల హడావిడి కొంత తగ్గింది. ఒకప్పుడు అడపాదడపా వచ్చే ఐపీవోలు కరోనా తర్వాత మాత్రం సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఒకదానిని మించి మరో పెద్ద ఐపీవో లిస్టింగ్ కోసం దేశీయ స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ ఐపీవో ఇప్పటికే దేశంలో అతిపెద్ద ఐపీవోగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రికార్డులను చెరిపేయటానికి సిద్ధం అవుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుననది ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐపీవో ప్లాన్ గురించే. సౌత్ కొరియాకి చెందిన ఈ కంపెనీకి భారత్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సబ్సిడరీ కంపెనీ ఉంది. దీని ద్వారా టెక్ దిగ్గజం తన వ్యాపారాన్ని ఇండియాలో నిర్వహిస్తోంది. ఇప్పటికే హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి విదేశీ సంస్థలు ఇండియాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సైతం అదే దారిని ఎంచుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఐపీవోను 2025లో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రిపోర్ట్ ప్రకారం కంపెనీ ప్రస్తుతం మార్కెట్ విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంస్థ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.8000 కోట్ల నుంచి రూ.12,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయ ఐపీవో మార్కెట్ ద్వారా కంపెనీలు దాదాపు 49 బిలియన్ డాలర్లను మూలధన అవసరాల కోసం సమీకరించుకున్నాయి. బలమైన ఐపీవో స్వీకరణ దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కనిపిస్తున్న వేళ పదుల సంఖ్యలో ఐపీవోలు ప్రతి నెల జాబితా కోసం మార్కెట్లోకి వస్తున్నాయి.
ఐపీవోకి ఇది సరైన సమయంగా భావించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇందుకోసం సహకరిస్తున్న బ్యాంకుల జాబితాలో యాక్సిస్ క్యాపిటల్‌ని కూడా చేర్చుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎల్‌జీ సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలను తన ఐపీవో ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు నియమించుకుంది. దీనికి ముందు హ్యుందాయ్ ఇండియా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.27,870 కోట్లను సమీకరించి దీనికి ముందు ఎల్ఐసీ పేరుతో ఉన్న రికార్డును చెరిపేసింది. ప్రస్తుతం ఇప్పటి వరకు భారతీయ ఐపీవో చరిత్రలో అత్యధిక మెుత్తాన్ని మార్కెట్ల నుంచి సమీకరించిన సంస్థగా నిలిచింది.


Click it and Unblock the Notifications