LG Electronics IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలానికి బ్రేక్ పడి కొన్ని వారాలు గడుస్తోంది. ఒకప్పుడు రోజూ ఒకటి లేదా రెండు వరకు ఐపీవోలు నిరంరతం దలాల్ స్ట్రీట్ లో అడుగుపెడుతుండేవి. కానీ ఇప్పుడు మార్కెట్ల కరెక్షన్ కారణంగా కంపెనీలు తమ ఐపీవోల ఫ్లోటింగ్ స్పీడును తగ్గించాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే దాదాపుగా నిలిపివేశాయని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్లు ప్రస్తుతం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ ఐపీవో ఇన్వెస్టర్లలో కొత్త ఆలోచనలను చిగురింపచేసే శుభవార్త ఒకటి ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జి లిమిటెడ్ యాజమాన్యంలోని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీవో ప్రారంభం కానుంది. రూ.15,000 కోట్ల విలువైన ఐపీవోకు కంపెనీ సెబీ ఆమోదం పొందింది. హ్యుందాయ్ తర్వాత భారత మార్కెట్లో తన ఐపీవోను తీసుకువస్తున్న రెండవ దక్షిణ కొరియా కంపెనీ ఇదే అవుతుందని తెలుస్తోంది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఐపీవో ద్వారా మెుత్తం 10.18 కోట్ల షేర్లను విక్రయించనుందని సమాచారం.
వాస్తవానికి ఎల్‌జి కంపెనీ తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు డిసెంబర్ 6, 2024న అనుమతి కోరుతూ సెబీ వద్ద దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. 1997లో స్థాపించబడిన కంపెనీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టెలివిజన్లు, మైక్రోవేవ్‌లు వంటి గృహోపకరణాల తయారీ, విక్రయ వ్యాపారంలో ఉంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 900 కంటే ఎక్కువ సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.21,352 కోట్లుగా ఉండగా.. కంపెనీ నికర లాభం రూ.1511.07 కోట్లుగా నమోదైంది.

రిపోర్ట్ ప్రకారం కంపెనీ ప్రస్తుతం మార్కెట్ విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంస్థ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.8000 కోట్ల నుంచి రూ.12,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయ ఐపీవో మార్కెట్ ద్వారా కంపెనీలు దాదాపు 49 బిలియన్ డాలర్లను మూలధన అవసరాల కోసం సమీకరించుకున్నాయి. బలమైన ఐపీవో స్వీకరణ దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కనిపిస్తున్న వేళ పదుల సంఖ్యలో ఐపీవోలు ప్రతి నెల జాబితా కోసం మార్కెట్లోకి వస్తున్నాయి.
ఐపీవోకి ఇది సరైన సమయంగా భావించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇందుకోసం సహకరిస్తున్న బ్యాంకుల జాబితాలో యాక్సిస్ క్యాపిటల్‌ని కూడా చేర్చుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎల్‌జీ సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలను తన ఐపీవో ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు నియమించుకుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications