Jio IPO: ఇన్వెస్టర్లకు పండుగలాంటి వార్త.. రూ.37 వేల కోట్ల జియో ఐపీఓ..!

ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న జియో ఐపీఓ గురించి అప్డేట్ వచ్చింది. జియో తన ఐపీఓ ద్వారా రూ.37 వేలు కోట్లు సేకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తన ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం 19 జూన్ 2026న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను దాఖలు చేసింది. దీనికి 28 ఆగస్టు 2026న నియంత్రణ సంస్థ నుంచి ఒక పరిశీలన లేఖ అందింది. ప్రతిపాదిత జియో ప్లాట్‌ఫామ్స్ IPO అనేది 100 శాతం బుక్-బిల్ట్ ఫ్రెష్ ఇష్యూగా రానుంది. దీని ద్వారా ఒక్కో షేరు ముఖ విలువ రూ.10తో, గరిష్టంగా 27 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

ఈ ఇష్యూలో ప్రస్తుతం ఆఫర్-ఫర్-సేల్ అంశం లేదు. ఈ 27 కోట్ల షేర్లు ఇష్యూ తర్వాత కంపెనీ చెల్లించే ఈక్విటీ మూలధనంలో 2.9% వాటాను సూచిస్తాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది. 31 మార్చి 2026 నాటికి జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 66.43% వాటాను కలిగి ఉంది. ఆర్థిక, వ్యూహాత్మక పెట్టుబడిదారుల బృందం, ఇతర వాటాదారులు మిగిలిన యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు. ప్రతిపాదిత షేర్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండింటిలోనూ లిస్ట్ చేయనున్నారు. ఈ ఇష్యూకు కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ను రిజిస్ట్రార్‌గా నియమించగా, ఈ ఆఫరింగ్‌ను నిర్వహించడానికి 19 మంది సభ్యులతో కూడిన బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్ల బృందాన్ని నియమించారు.

jio IPO

ఈ సిండికేట్‌లో కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, యాక్సిస్ క్యాపిటల్, బీఎన్‌పీ పారిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, గోల్డ్‌మన్ సాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇండియా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, జెఫరీస్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్ ఇండియా, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, సిఎల్ఎస్ఏ ఇండియా, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, 360 వన్ డబ్ల్యూఏఎం ఉన్నాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ విలువ దాదాపు రూ. 37,700 కోట్లు లేదా దాదాపు $3.8 బిలియన్లుగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఈ ఆఫరింగ్ 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా జారీ చేసిన రూ.27,870 కోట్ల ఐపీఓ కంటే ఎక్కువ. జియో ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు, జియో ప్లాట్‌ఫామ్స్ ముఖ్య అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జేఐఎల్) బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం నికర నిధులను ఆర్‌జేఐఎల్ కొన్ని బకాయి రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా ముందస్తుగా చెల్లించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా వచ్చే నిధులలో ఆర్‌జేఐఎల్ తీసుకున్న రుణాలు దాదాపు రూ.27,500 కోట్లుగా ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+