FMCG: సర్ఫ్ ఎక్సెల్, రీన్, వీల్ ధరలు భారీగా పెంపు..!
ప్రముఖ ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తమ కంపెనీకి చెందిన పలు డిటర్జెంట్ వస్తువులపై ధరలను పెంచింది.
వ్యయాల ఒత్తిడిని అధిగమించడానికి, లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ఇందులో భాగంగా సర్ఫ్ ఎక్సెల్, రీన్, వీల్ వంటి ఉత్పత్తుల ధరలను 11 శాతం వరకు పెంచింది. ప్యాక్ పరిమాణాన్ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఒక్కో ఉత్పత్తిపై రూ. 1 నుంచి రూ. 10 వరకు ధరలను పెంచింది. వీటితో పాటు మోతీ గులాబ్ సబ్బు ధరను కూడా కంపెనీ పెంచింది.
ప్యాక్ పరిమాణాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నాయి. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ 1 కేజీ ప్యాక్ ధరను రూ. 235 నుండి రూ. 245కి పెంచింది. అలాగే 500 గ్రాముల ప్యాక్ ధరను రూ. 123 నుంచి రూ. 128కి పెంచింది. అదేవిధంగా సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 1 కేజీ ప్యాక్ ధరను రూ. 5 పెంచి రూ. 172కి చేర్చింది. 500 గ్రాముల ప్యాక్ ధరను రూ. 85 నుంచి రూ. 87కి పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్ ధరను రూ. 3 పెంచి రూ. 45కి చేర్చింది. 200 గ్రాముల సబ్బులు కలిగిన నాలుగు ప్యాక్ల సెట్ ధరను రూ. 10 పెంచి రూ. 155కి పెంచింది.

వీటితో పాటు రీన్, వీల్ డిటర్జెంట్ల ధరలను కూడా హిందుస్థాన్ యూనిలీవర్ పెంచింది. రీన్ అలా 500 మి.లీ ప్యాక్ ధరను రూ. 90 నుంచి రూ. 95కి చేర్చింది. ఈ ధరల పెంపుతో రీన్ డిటర్జెంట్ పౌడర్ 1 కేజీ ప్యాక్ ధర ఇప్పుడు రూ. 123కి చేరింది. 500 గ్రాముల ప్యాక్ కోసం వినియోగదారులు రూ. 61 చెల్లించాల్సి ఉంటుంది. వీల్ డిటర్జెంట్ పౌడర్ 1 కేజీ ప్యాక్ ధరను రూ. 3 పెంచడంతో అది రూ. 90 నుంచి రూ. 93కి పెరిగింది. అదేవిధంగా దీని 500 గ్రాముల ప్యాక్ ధరను రూ. 46 నుంచి రూ. 47కి చేర్చారు. ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులుగా ఉన్నాయి.
ఈ ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ మోతీ గులాబ్సబ్బు ధరను కూడా పెంచింది. ఈ సబ్బు (150 గ్రాముల ప్యాక్) ధరను రూ. 74 నుంచి రూ. 82కి పెంచింది. అంటే ఇది 10 శాతానికి పైగా పెరిగింది. ముడి పదార్థాలు, ఇతర ఉత్పాదక వ్యయాలు పెరుగుతుండటంతో, వాటి భారాన్ని తట్టుకోవడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు కష్టతరంగా మారిన నేపథ్యంలో ఈ ధరల పెంపును చేపట్టారు. ఉత్పాదక వ్యయాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కంపెనీ క్రమపద్ధతిలో ధరలను పెంచుకుంటూ వెళ్తుందని హెచ్యుఎల్ (HUL) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రియా నాయర్ గతంలో చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications