ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్.. గ్రో (Groww) షేర్లు నవంబర్ 19న ఒక్కసారిగా 10 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. స్టాక్ మార్కెట్‌లో అద్భుతంగా దూసుకుపోయిన తర్వాత ఉన్నట్టుండి పతనం చెందాయి. ఇంతకీ దీనికి గల కారణాలేంటి? ఒకసారి విశ్లేషిద్దాం.

గ్రో కంపెనీ పేరెంట్ సంస్థ అయిన'బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్' షేర్లు పెరిగినట్టే పెరిగి మళ్లీ కిందకు పడిపోయాయి. గ్రో కంపెనీ షేర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగానే మొదట ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టారు. కంపెనీ షేర్లు భారీగా లాభాలు చూస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆ లాభాల కోసం షేర్లు అమ్మేసుకున్నారు. దాంతో ఈ పతనం సంభవించింది. అయితే ఇది తాత్కాలిక పతనం మాత్రమే.
ఎంట్రీతో అదరగొట్టింది
గ్రో షేర్లు నవంబర్ 12న స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించాయి. లిస్టింగ్ సమయంలో ఐపీఓ (IPO) ధర కంటే 14 శాతం ఎక్కువ ప్రీమియంతో.. ఒక్కో షేరు రూ.114 వద్ద లిస్ట్ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే షేర్ ధర ఏకంగా 94 శాతం పెరిగి, గరిష్టంగా రూ.193.91 కి చేరుకుంది. అయితే బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో షేరు ధర (Groww share price today) 10 శాతం లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యి రూ.169.94 వద్ద నిలిచింది.
ఎందుకు పడిపోయిందంటే..
గ్రో షేర్ విలువ చాలా వేగంగా పెరగడంపైనే విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లిస్టింగ్ తర్వాత గ్రో షేర్ వాల్యూ చాలా వేగంగా పెరిగింది. మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal), ఏంజెల్ వన్ (Angel One) వంటి సంస్థల కంటే చాలా ఎక్కువగా పెరిగింది. అయితే తాత్కాలిక లాభాల కోసం షేర్లు అమ్మేసుకున్న ఇన్వెస్టర్ల వల్ల పతనం చూడాల్సి వచ్చింది. అయితే లాంగ్ టర్మ్ లో ఈ షేర్ల పర్ఫామెన్స్ మంచిగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
నిపుణుల సలహా ప్రకారం ఇన్వెస్టర్లు వారి వారి ప్రణాళికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. జాగ్రత్తపడే ఇన్వెస్టర్లు కొంత లాభాన్ని బుక్ చేసుకోవచ్చు. లేదా రిస్క్ తీసుకుంటాం అనుకునే వాళ్లు స్టాప్‌లాస్ (Stoploss) పెట్టుకుని కొంతకాలం పాటు కొనసాగవచ్చు. ఇక కొత్త ఇన్వెస్టర్లు అయితే.. షేర్ వాల్యూ తగ్గినప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేయడం మంచి ఆప్షన్. కాబట్టి పరిశీలించొచ్చు.
షేర్ల వేలం
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గ్రో సంస్థకు చెందిన 30 లక్షలకు పైగా షేర్లు వేలం విండోలోకి వచ్చాయి. దీనికి కారణం షార్ట్ సెల్లర్లు చేసిన పొరపాటు అని నిపుణులు అంటున్నారు. కొంతమంది ట్రేడర్లు మార్కెట్ పడిపోతుందేమో అని అంచనా వేసి తమ దగ్గర లేని షేర్లను అమ్మేస్తారు. ఆ తర్వాత, ధర తగ్గినప్పుడు మళ్లీ కొని డెలివరీ ఇస్తారు. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. అయితే మొన్నటివరకూ గ్రో షేరు ధర పెరుగుతూ వచ్చింది. దీంతో ఆ షార్ట్ సెల్లర్లు డెలివరీ ఇవ్వడానికి షేర్లను కొనుగోలు చేయలేకపోయారు. అందువల్ల ఆ 30 లక్షల షేర్లు ఆటోమేటిక్‌గా సెటిల్‌మెంట్ కోసం వేలం విభాగంలోకి వచ్చాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications