IPO News: కొంప ముంచిన ఐపీవో.. తొలిరోజు ఇన్వెస్టర్లకు కన్నీళ్లు మిగిల్చిన SME ఐపీవో.. కొన్నారా?
Landmark Immigration IPO: ఇటీవల వారాల్లో లిస్ట్ అయిన అనేక ఎస్ఎమ్ఈ ఐపీవోలు పెట్టుబడిదారుల డబ్బును తొలిరోజే రెండింతలు చేశాయి. ఈ క్రమంలో వచ్చిన మెయిన్ బోర్డ్ ఐపీవోలు కూడా మంచి రాబడులను లిస్టింగ్ సమయంలోనే అందించాయి. అయితే నేడు బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు ఒక ఐపీవో నిరాశను మిగిల్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ల్యాండ్ మార్క్ ఇమ్మిగ్రేషన్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇన్వెస్టర్లు లిస్టింగ్ నుంచి భారీ లాభాలను ఆశించినప్పటికీ.. ఇష్యూ ధర కంటే కేవలం రూ.3 ప్రీమియం ధర రూ.75 వద్ద నేడు జాబితా అయ్యాయి. దీంతో లిస్టింగ్ గెయిన్స్ కోసం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ఫ్లాట్ లిస్టింగ్ నుంచి కలవరానికి గురయ్యారు. లక్షలు పెట్టి బెట్ వేసి కేవలం రూపాయలు ఏరుకోవాల్సి రావటంపై కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇంట్రాడేలో స్టాక్ ధర రూ.78.75కి చేరుకున్నాయి.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ మూలధన అవసరాల కోసం మార్కెట్ల నుంచి రూ.40.32 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం కంపెనీ 56 లక్షల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను విక్రయించింది. సాధారణ పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం కంపెనీ ఇష్యూ జనవరి 16 నుంచి 20 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.70-72గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1,15,200 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.6.11 కోట్లను విజయవంతంగా సమీకరించింది. గ్రేమార్కెట్లో కంపెనీ పనితీరు ఊహించిన స్థాయిలో లేకపోవటంతో మ్యూటెడ్ లిస్టింగ్ నమోదు చేసింది. మెుత్తంగా మూడు రోజుల ఇష్యూ ఓపెన్ సమయంలో 72 సార్లు సబ్‌స్క్రయిబ్ నమోదు చేసింది. ఇదే సమయంలో రిటైల్ కేటగిరీ 81 సార్లు, నాన్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 116.71 సార్లు సభ్యత్వాన్ని చూసింది. ఇదే క్రమంలో ప్రమోటర్ల వాటా కంపెనీలో ఐపీవోకి ముందు 97.92 శాతం నుంచి 71.31 శాతానికి తగ్గింది.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి ల్యాండ్ మార్క్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ కంపెనీ 2010లో స్థాపించబడింది. కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కన్సల్టెన్సీ సేవల్లో నిమగ్నమై ఉంది. ఇది విద్యార్థులకు గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్లస్టింగ్ సేవలను అందిస్తూ విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ సేవలను అందిస్తోంది. అలాగే టూరిస్టులకు, వ్యాపారులకు, శాశ్వత నివాసితులకు వీసా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థకు సొంతంగా 9 కేంద్రాలు ఉండగా ఫ్రాంచైజీలను సైతం కలిగి ఉన్నది.


Click it and Unblock the Notifications