Lalithaa Jewellery Mart: ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువలో ట్రేడవుతోన్న లలితా జ్యువెలరీ షేర్లు.. ఇప్పుడు కొనుగోలు చేయవ

లలితా జ్యువెలరీ మార్ట్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ధరపై 32% ప్రీమియంతో ఇవి లిస్ట్ అయ్యాయి. ఈ స్టాక్ దాని ఇష్యూ ధర అయిన రూ. 201తో పోలిస్తే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రూ. 265 వద్ద విస్టయ్యాయి. ఆగస్టు 17-19 మధ్య జరిగిన ఐపీఓ (IPO) ప్రక్రియలో 62.97 రెట్లు అధిక స్పందన లభించింది. ఈ జ్యువెలరీ రిటైలర్ షేర్లు NSEలో ఒక్కో షేరుకు రూ. 265 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇది 31.84 శాతం ప్రీమియం లిస్ట్ అయింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ. 265.30 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇది 31.99 శాతం ప్రీమియంతో అరంగేట్రం చేసింది. లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ. 14,849.10 కోట్లుగా నమోదైంది.

అయితే లలితా జ్యువెలరీ మార్ట్ షేర్లు అప్పటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాలకు రూ.244.94 ట్రేడవుతున్నాయి. అయితే ఇప్పటికీ ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువగానే ట్రేడవుతోంది. ఐపీఓ ప్రైస్ రూ.201 గా ఉంది. అంటే రూ.43 ఎక్కువలో ట్రేడవుతోంది. లలితా జ్యువెలరీ మార్ట్ రూ.1,700 కోట్ల విలువైన ఐపీఓలో రూ.1,200 కోట్ల వరకు తాజా షేర్ల జారీ, రూ.500 కోట్ల విలువైన 'ఆఫర్-ఫర్-సేల్' (OFS)గా ఉంది. దీని ద్వారా సమకూరిన నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు. లిస్టింగ్ సమయంలో 37 శాతం లాభం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, లలితా జ్యువెలరీ మార్కెట్ అరంగేట్రం ఆ అంచనాల కంటే తక్కువ ప్రీమియంలోనే లిస్ట్ అయింది.

Lalitha jewellary

కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ వంటి సంస్థాగత పోటీదారులతో పోలిస్తే లలితా జ్యువెలరీ మార్ట్ కంపెనీ ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌ను కలిగి ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ వెల్త్ విభాగం అధిపతి శివాని న్యాతి అన్నారు. అలాగే 41 శాతానికి పైగా ఉన్న ROE (ఈక్విటీపై రాబడి) బలమైన మూలధన సామర్థ్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే, అధిక ఇన్వెంటరీ (సరుకు నిల్వలు) ఉండటం, సుమారు రూ. 397.7 కోట్ల ప్రతికూల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రూ. 1,066 కోట్ల GST వివాదం, ప్రమోటర్లకు సంబంధించిన అంశాలు ప్రధాన రిస్క్‌లుగా మిగిలి ఉన్నాయన్నారు. ఇంత భారీ లిస్టింగ్ లాభం తర్వాత, పెట్టుబడిదారులు అధిక ధరల వద్ద ఈ స్టాక్‌ను కొనడానికి ప్రయత్నించకూడదన్నారు.

తమ దృక్పథం సానుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తతో ఉందన్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారు 'క్లోజింగ్ బేసిస్' ప్రకారం రూ. 245 వద్ద స్టాప్-లాస్‌తో షేర్లను తమ వద్దే ఉంచుకోవచ్చు. కొత్త పెట్టుబడిదారులు కొనుగోలు చేయడానికి ముందు ధరలో గణనీయమైన తగ్గుదల కోసం వేచి ఉండాలన్నారు. అంతకుముందు, గోల్డ్‌మన్ సాక్స్, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ వంటి యాంకర్ ఇన్వెస్టర్ల నుండి కంపెనీ రూ. 508 కోట్లను సమీకరించింది. 1985లో చెన్నైలోని టి.నగర్‌లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించిన లలితా జ్యువెలరీ మార్ట్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలను విక్రయిస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+