IPO News: గ్రేమార్కెట్లో 100% లాభం.. అదరగొట్టేస్తున్న SME ఐపీవో, బెట్టింగ్ ఛాన్స్ రేపటి వరకే..!!
Lakshya Powetech IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం తిరిగి మెుదలైంది. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కేటగిరిలీ వస్తున్న మరో ఐపీవో పెట్టుబడిదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టనుందని గ్రేమార్కెట్ ప్రీమియం ప్రకారం తెలుస్తోంది. స్టాక్ ధరకు సమానంగా జీఎంపీ కొనసాగటంతో బెట్టింగ్ వేసేందుకు చాలా మంది పెట్టుబడిదారులు ముందుకువస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది లక్ష్య పవర్‌టెక్ కంపెనీ ఐపీవో గురించే. ఐపీవో అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో మెుదటి రోజు ఐపీవో 61 సార్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీవోపై రేపటి వరకు బెట్టింగ్ వేసేందుకు వెసులుబాటు ఉండటంతో.. ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపుతున్నారు. వాస్తవ షేర్ గరిష్ఠ ఇష్యూ ధర కంటే గ్రేమార్కెట్లో ప్రీమియం 95 శాతం కంటే ఎక్కువగా ఉండటం పెద్ద సమచలనంగా మారింది. ఈ గ్రేమార్కెట్ ప్రీమియం లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే మెుదటి రోజున స్టాక్ రూ.350 కంటే ఎక్కువ రేటుకు మార్కెట్లో జాబితా అవుతుంది.

ఐపీవో వివరాలను పరిశీలిస్తే తాజా ఆఫర్ ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.49.91 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.171-180గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1.44 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అక్టోబర్ 23న అరంగేట్రం చేయనున్నాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు ఐపీవోలో రిజర్వు చేసిన షేర్లను ఒక్కోటి రూ.15 డిస్కౌంట్ ధరకు అందించాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లక్ష్య పవర్‌టెక్ ఐపీవో మొదటి రోజు మొత్తం 61.71 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 100.68 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 64.61 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 1.37 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది.
కంపెనీ వ్యాపారం..
లక్ష్య పవర్‌టెక్ లిమిటెడ్ 2012లో స్థాపించబడింది. కంపెనీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సేవలలో ప్రత్యేకత కలిగిన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థగా ప్రారంభమైంది. సంస్థ ఫ్రీలాన్స్ పవర్ జనరేషన్ కన్సల్టెన్సీ నుంచి గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు, భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సేవలను అందిస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోకి విస్తరించడం ద్వారా కంపెనీ తన సేవలను విస్తరించింది. కంపెనీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది.


Click it and Unblock the Notifications