Kothari Industrial Corporation: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కరెక్షన్ చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలోని కొన్ని కంపెనీల షేర్లు మాత్రం పెట్టుబడిదారులకు సూపర్ రాబడులను అందించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కోతారీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. స్టాక్ మార్కెట్లు సైతం అనిశ్చితులతో ఒడిదొడుకులను చూస్తున్న సమయంలో కంపెనీ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ సంస్థ షేర్లు గత 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.82 నుంచి 8,922% భారీ వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో వాస్తవానికి కోతారీ ఇండస్ట్రియల్ స్టాక్ 2024 ఏప్రిల్ 2న రూ.1.82 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేడు కంపెనీ షేర్లు లాభపడటంతో ఒక్కోటి రూ.162.40కు చేరుకుంది. దీంతో నేడు స్టాక్ బీఎస్ఈలో ఆల్‌టైమ్ హై రికార్డు ధరకు చేరుకుంది.
నేడు ఇంట్రాడేలో కోతారీ ఇండస్ట్రియల్ షేరు బీఎస్ఈలో రూ.162.40 వద్ద ట్రేడయింది. ఇది గత ముగింపు ధర రూ.159.25 కంటే 2% పెరుగుదలను నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.690 కోట్లకు చేరుకుంది. 2024 డిసెంబరులో ముగిసిన త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచారు. ప్రస్తుతం వీరు కంపెనీలో 53 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ షేర్లు ఎన్‌హాన్స్డ్ సర్విలెన్స్ మేజర్ స్టేజ్ 2 కింద ఉంది. ఈ షేర్లు అతి పెద్దమొత్తంలో పరుగు వేయడం లేదా పటిష్టంగా మార్పడి పోవడం లేదా మానిప్యులేషన్‌కు గురికావడం వంటి మార్పులను సూచిస్తాయి.

కోతారీ ఇండస్ట్రియల్ షేరు గత మూడు నెలలలో 115.47% పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ఒక సంవత్సరంలో 92% పెరిగింది. స్టాక్‌కు సంబంధించి టెక్నికల్ పరిస్థితి చూస్తే కోతారీ ఇండస్ట్రియల్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్(RSI) 84.5 వద్ద ఉంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కోతారీ కంపెనీలో 1.89% వాటా ఉంది. ఇదే సమయంలో కంపెనీ యాజమాన్యంలో 44.1% వాటా ప్రొమోటర్లు హోల్డ్ చేస్తుననారు.
కోతారీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఫర్టిలైజర్స్ తయారీ, డ్రోన్ సేవలు, హోటల్ కార్యకలాపాలు, షూస్, లెదర్ వస్త్రాల తయారీ వంటి వ్యాపారాలను కొనసాగిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలలో వినియోగదారుల వ్యాపార విస్తరణతో గుర్తింపు పొందింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..



Click it and Unblock the Notifications