భారతదేశంలో ఆఫీస్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా నిలిచిన Knowledge Realty Trust (KRT) స్టాక్ మార్కెట్లోకి బ్లాక్ బాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. IPO ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన ఈ దిగ్గజం ఈరోజు స్టాక్ మార్కెట్‌లో స్థిరంగా అరంగేట్రం చేసింది.బ్లాక్‌స్టోన్ మరియు సత్వ గ్రూప్ మద్దతుతో ఉన్న ఈ REIT, ఆగస్టు 5, 2025న పబ్లిక్ ఇష్యూ ప్రారంభించగా, బిడ్డింగ్ విండో ఆగస్టు 7 వరకు తెరిచి ఉండనుంది. కంపెనీ స్టాక్ NSEలో రూ.103, BSEలో రూ.104 వద్ద జాబితా చేయబడింది, అయితే దాని ఇష్యూ ధర యూనిట్‌కు రూ.100గా నిర్ణయించబడింది. దీంతో పెట్టుబడిదారులు లిస్టింగ్ చేసిన మొదటి రోజే దాదాపు 4% ప్రీమియం పొందారు.
కంపెనీ రూ.4,800 కోట్ల విలువైన ఐపీఓ పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే ఎంట్రీతోనే అద్భుతమైన స్పందనను పొందింది. మొత్తంమీదజజ ఈ ఇష్యూ 12.48 సార్లు సబ్‌స్క్రైబ్ చేసింది. సంస్థాగత పెట్టుబడిదారుల (QIB) వాటా 9.07 సార్లు సబ్‌స్క్రైబ్ చేశారు. అయితే సంస్థాగతేతర పెట్టుబడిదారులు (NII) దీనిని 16.57 సార్లు సబ్‌స్క్రైబ్ చేశారు. కాగా కంపెనీ IPO కి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఇప్పటికే రూ.1,620 కోట్లు సేకరించింది.ఈ లిస్టింగ్ లాభం గ్రే మార్కెట్లో కనిపించిన 2% అంచనాను కూడా మించిపోయింది. తద్వారా పెట్టుబడిదారులకు ప్రారంభ నుండే విశ్వాసాన్నిచ్చింది.

తాజా ఇష్యూ నుండి సేకరించిన మొత్తాన్ని ప్రధానంగా దాని SPV (స్పెషల్ పర్పస్ వెహికల్స్), పెట్టుబడి సంస్థల రుణ మొత్తాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించడానికి ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ఇది మొత్తం రూ.4,640 కోట్లుగా ఉంది. ఇందులో కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా ఉపయోగించనున్నారు. నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ REIT దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ మరియు అహ్మదాబాద్‌లోని GIFT సిటీలలో కంపెనీ 30 గ్రేడ్-ఎ కార్యాలయ ఆస్తులను నిర్వహిస్తోంది. మొత్తం 48 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్ట్‌ఫోలియోలో, 37 మిలియన్ చ.అ. ఇప్పటికే అభివృద్ధి చెయ్యబడి గూగుల్, అమెజాన్, హెచ్‌పీ వంటి అంతర్జాతీయ కంపెనీలకు లీజుకు ఇవ్వబడ్డాయి.
మార్చి 31, 2025 నాటికి కంపెనీ మొత్తం నిబద్ధత కలిగిన ఆక్యుపెన్సీ 91.4 శాతంగా ఉంది. దీని అద్దెదారుల స్థావరంలో ఫార్చ్యూన్ 500 కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, భారతదేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. FY25లో చూసుకున్నట్లయితే నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ REIT మొత్తం ఆదాయం రూ.4,146.86 కోట్లుగా నమోదైంది. ఇది సంవత్సరానికి 16 శాతం వృద్ధిని చూపుతోంది. అయితే, దాని పన్ను తర్వాత లాభం 34 శాతం తగ్గి రూ.222.52 కోట్లకు చేరుకుంది.
KRT IPO ముఖ్య సమాచారం
ఇష్యూ సేకరణ లక్ష్యం : రూ. 4,800 కోట్లు
ఇష్యూ రకం : Entirely fresh issue (48 కోట్ల షేర్లు)
దరఖాస్తు ధర శ్రేణి : రూ. 95 - రూ. 100 (per unit)
Lot Size : 150 షేరు
లాట్ సైజ్ ధర (కనీస) : రూ. 14,250
బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ : Kotak Mahindra Capital
రిజిస్ట్రార్ : KFin Technologies
బ్లాక్‌స్టోన్ , సత్వ గ్రూప్ మద్దతుతో ఉన్న ఈ REIT..భారతదేశ వాణిజ్య కార్యాలయ స్థల రంగంలో పెట్టుబడిదారుల ఆసక్తికి బేరోమీటర్‌గా పరిగణించబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దూసుకెళ్తున్న IT-సర్వీస్ రంగం, ఫ్లెక్స్ వర్క్ ట్రెండ్, ప్రధాన నగరాల్లో కార్యాలయ డిమాండ్ పెరుగుతోందన్న నేపథ్యంలో.. KRT రాబోయే సంవత్సరాల్లో మంచి స్థిరమైన క్యాష్‌ఫ్లోలు సాధించగలదని అనలిస్టులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఇన్వెస్టర్లకు పండగే పండగ.. Bharat PET ఐపీఓ వస్తోంది.. రూ. 750 కోట్లు మీద గురిపెట్టిన ప్యాకేజింగ్ దిగ్గజం..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications