Monday Markets: ఈ వారం మార్కెట్లను నడిపించేది ఆ రెండే.. బీ కేర్ ఫుల్ ఇన్వెస్టర్స్..!! కంగారొద్దు..
Markets Next Week: గడచిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్లోబల్ మార్కెట్లకు అనుకూలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. సాధారణంగా ఎన్నికల అయిపోయే వరకు యూఎస్ మార్కెట్లు భారీ ఓలటాలిటీతో కొనసాగటం గతంలో కూడా మనం గమనించటం జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉంటుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయి, ఏఏ కారకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయనే అంశాలను వెతికే పనిలో చాలా మంది ఇన్వెస్టర్లు కొనసాగుతున్నారు. గడచిన వారం బెంచ్ మార్క్ సూచీల పనితీరును గమనిస్తే నిఫ్టీ 0.44 శాతం క్షీణతను చూడగా చివరికి లాభాల్లో ముగిసింది. ఇదే క్రమంలో సెన్సెక్స్ సూచీ 1.27 శాతం లాభంతో శుక్రవారం నాటికి లాభాల్లో ప్రయాణాన్ని క్లోజ్ చేసింది. అలాగే అక్టోబర్ నెలలో విదేశీ సంస్థాగత మదుపరులు దాదాపు రూ.77,700 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఇదే ధోరణి సమీప కాలంలో కూడా కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్స్ నిపుణుడు వికే విజయ్ కుమార్ వెల్లడించారు.

అలాగే రానున్న వారంలో ఐపీవోలు సైతం మార్కెట్లో పెద్ద రద్దీని సృష్టించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు మెయిన్ కేటగిరీ ఐపీవోలు పెద్ద మెుత్తంలో డబ్బును సమీకరించటం కోసం అడుగుపెడుతున్నాయి. ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో వారీ ఎనర్జీస్, దీపక్ బుల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఆఫాక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గోదావరి బయో రిఫైనరీస్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీటికి అదనంగా ఎస్ఎమ్ఈ కేటగిరీకి చెందిన అనేక ఐపీవోలు మార్కెట్లోకి అడుగుపెట్టడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇక లిస్టింగుల విషయానికి వస్తే అందరి చూపు దేశంలోని అతిపెద్ద ఐపీవోగా వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియాపైనే కొనసాగుతోంది.
ఇదే క్రమంలో పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన మరొక అంశం కార్పొరేట్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు. అవును కంపెనీలు ఇప్పటికే క్యూ ఎర్నింగ్స్ స్ప్రీ మెుదలుపెట్టిన వేళ కంపెనీల పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి అంశాలను వీటి నుంచి గ్రహించాల్సి ఉంటుంది. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా చూడాల్సిన విషయం క్రూడ్ ఆయిల్ ప్రైస్ కదలికలు. ప్రస్తుతం మధ్య ప్రాశ్చంలో ఉద్రిక్తతలు ఇరాన్- ఇంజ్రాయెల్ మధ్య తారాస్థాయిలకు చేరుకున్న వేళ క్రూడ్ ధరలపై దృష్టి తప్పనిసరిగా మారింది. గతవారం క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ దాదాపు 7 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. చివరిగా చైనా ఎకనమిక్ డేటా అందరూ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications