Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తమ ప్రయాణాన్ని పతనంలో ముగించాయి. ఉదయం నుంచి నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించిన సూచీలు ఇంట్రాడేలో అత్యధికంగా సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పతనాన్ని చూసింది. చివరికి అదే ధోరణితో నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.
1. ముందుగా స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసిన అతిపెద్ద విషయం అమెరికా స్టాక్ మార్కెట్ సూచీల పతనం. ఈ క్రమంలో డౌ ఫ్యూచర్లు, నాస్డాక్ ఫ్యూచర్లు పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలైన మెటా, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఆపిల్ తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

2. ఇక స్టాక్ మార్కెట్లను పతనానికి గురిచేసిన రెండవ అంశం డీప్‌సీడ్ భయాలతో చిప్ తయారీ రంగంలోని కంపెనీ షేర్లు కుప్పకూలాయి. చైనాకు చెందిన డీప్‌సీక్ డిసెంబర్ చివరిలో ఉచిత, ఓపెన్-సోర్స్ లార్జ్ మోడల్ లాంగ్వేజ్ లను ప్రారంభించింది. దీనిని కేవలం రెండు నెలల్లో 6 మిలియన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గత వారం ల్యాబ్ r1ను ప్రారంభించింది. దీంతో ఆసియాలోని ప్రధానంగా జపాన్ కేంద్రంగా ఉన్న చిప్ తయారీ సంస్థ షేర్లు కుప్పకూలాయి. ఇదే క్రమంలో భారతీయ ఐటీ రంగంలోని కంపెనీలు కూడా భారీగా క్షీణతను చూశాయి.
3. మార్కెట్లను భయాలకు గురిచేసిన మూడవ అంశం డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య పన్నుల యుద్ధం. ఈ క్రమంలో కొలంబియాపై పన్నుల భారం మోపుతామని అమెరికా హెచ్చరించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదివారం తెల్లవారుజామున కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అమెరికా సైనిక విమానాలను ల్యాండింగ్ చేయడాన్ని తిరస్కరించారు. అమెరికా కొలంబియన్ వలసదారులను నేరస్థుల్లాగా చూడలేదని అన్నారు. అలాగే కొలంబియా నుంచి వలస వచ్చిన వారిని "అపరిమితంగా అంగీకరించడానికి" అమెరికా-కొలంబియా అంగీకరించాయి, డిపోర్టేషన్‌కి అనుమతిస్తాయి.
4. మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాల్లో రూపాయి పతనంతో పాటు విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు కూడా కారణంగా ఉన్నాయి. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా నుంచి భారీగా వెనక్కి తీసుకోవటం కూడా ఉన్నాయి.
5. బడ్జెట్ మరో నాలుగు రోజుల్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న వేళ చాలా మంది ఇన్వెస్టర్లు ప్రీ-బడ్జెట్ అప్రమత్తతను పాటిస్తున్నారు. చాలా మంది ముందస్తుగా మార్కెట్లలో లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం కూడా మార్కెట్ సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. వృద్ధిని పెంచడానికి ఆదాయపు పన్ను కోతలు లేదా ఇతర ఆర్థిక ఉద్దీపనల వంటి చర్యల కోసం మార్కెట్లు ఆశిస్తున్నాయి. ఈ అంచనాల చుట్టూ ఉన్న అనిశ్చితి మార్కెట్లలో అస్థిరతకు దారితీసింది.
6. ఇక చివరిగా మార్కెట్లలో ప్రతి ఇన్వెస్టర్ ఫెడరల్ రిజర్వు మానిటరీ పాలసీ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం జరగనున్న సమావేశంలో ఫెడ్ ఛైర్మన్ పావెల్ వడ్డీ రేట్లను ఎంత వరకు తగ్గిస్తారనే ఆలోచనలు అందరిలోనూ ఉన్నాయి. మెుత్తానికి మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 824 పాయింట్లు కోల్పోగా, మరో సూచీ నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 303 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1467 పాయింట్లు పతనం అయ్యాయి.


Click it and Unblock the Notifications