Markets Next Week: కొత్తనెలలోకి రేపటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు అడుగుపెడుతున్న వేళ ఇన్వెస్టర్లు శుభారంభాన్ని కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో మార్కెట్లను ప్రభావితం చేసే అనేక అంశాలపై ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ దృష్టిని కొనసాగిస్తున్నారు. గడచిన వారంలో మార్కెట్లు ఓలటాలిటీని చూడగా.. రానున్న వారంలో మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా ఇది మార్కెట్లపై కొంత ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ట్రేడర్లు గమనించాల్సిన ముఖ్యమైన కారణాలివే..
ముఖ్యంగా ఇన్వెస్టర్ల చూపు డిసెంబర్ మెుదటి వారంలో నిర్వహించనున్న రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమావేశంపై ఉంది. ఇదే క్రమంలో ఆటో సేల్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరు, రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఐపీవోల లిస్టింగ్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలరుతో రూపాయి మారకపు విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, దేశీయ అంతర్జాతీయ ఎకనామిక్ డేటా కీలకంగా ఉండనున్నాయి. ఇదే క్రమంలో కార్పొరేట్ యాక్షన్స్ కూడా మార్కెట్లపై తమ ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు, బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. గడచిన వారం చివరిలో వారాంతపు, నెలవారీ ఎక్స్ పెయిరీతో పాటు రిలయన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మార్కెట్లను నష్టాల్లోకి లాగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు వారం మెుత్తంలో లాభాలతో ముగిశాయి.

అయితే ఇక్కడ మార్కెట్లను ప్రతికీలంగా ప్రభావితం చేసే అంశాలు సైతం ఉన్నాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ అంచనా వేసిన 7 శాతం కంటే చాలా తక్కువగా కేవలం 5.4 శాతంగా వాస్తవ నంబర్లు ఉన్నాయి. వాస్తవానికి గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతం వృద్ధిని చూసిన సంగతి తెలిసిందే. దీనిపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నగరాల్లో ప్రజల కొనుగోళ్లు మందగించటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రులు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొనుగోళ్లను పెంచేందుకు బ్యాంకులు సరసమైన వడ్డీరేట్లకు లోన్స్ అందించాలని సూచించిన సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా పరిణామాలను పరిశీలిస్తే.. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ మిడ్‌వీక్ ప్రసంగం మార్కెట్లలో ట్రేడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే మార్కెట్లు ఫెడ్ పాలసీ పథంపై స్పష్టతను కోరుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ తయారీ, సేవల PMI డేటా కూడా పైప్‌లైన్‌లో ఉన్నందున, ద్రవ్య బిగింపు లేదా సడలింపులపై ఏదైనా సంకేతం ప్రపంచ మార్కెట్లలో కల్లోలం సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికా జాబ్ లెస్ క్లెయిమ్స్ డేటా, నిరుద్యోగిత గణాంకాలు సైతం విడుదలకానున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications