Market Next Week: వరుసగా రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూసిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయా లేక మార్కెట్లు ఎటు పయనిస్తాయనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉన్నాయి. అయితే గత శుక్రవారం మాత్రం మార్కెట్లు మెగా ర్యాలీని చూసి కేవలం ఒక్క రోజే దాదాపు రూ.2000 పాయింట్ల మేర సెన్సెక్స్ ర్యాలీని నమోదు చేసింది. ఇప్పుడు అందరి చూపు రానున్న వారంలో మార్కెట్లను ప్రభావితం చేయనున్న వివిధ అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం....
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు అదానీ గ్రూప్‌పై తాజాగా వెలుగులోకి వచ్చిన లంచం ఆరోపణలు దేశీయ స్టాక్ మార్కెట్లను అస్థిరతకు గురిచేశాయి. అయితే రానున్న నవంబర్ చివరి వారంలో పెట్టుబడిదారులు ప్రధానంగా దేశంలో వెువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, విదేశీ నిధుల ప్రవాహం, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు, యూఎస్ డాలర్, ముడి చమురు ధరలు, ప్రపంచ సంకేతాలు, దేశీయ-ప్రపంచ స్థూల ఆర్థిక అంశాలతో సహా కీలక ట్రిగ్గర్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిఫ్టీ సూచీ 2.39 శాతం పెరిగి 23,907.25 వద్దకు చేరుకోగా, సెన్సెక్స్ 2.54 శాతం లాభపడి 79,117.11 వద్దకు చేరుకుంది. రెండు వారాల నిరంతర పతనంతో పారాటం తర్వాత ఇది వచ్చింది.

శుక్రవారం భారతీయ ఈక్వీటి మార్కెట్లలో సంచలన ర్యాలీకి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్ల జోరు ముఖ్య కారణంగా ఉండగా.. ఇదే క్రమంలో అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల ధోరణి బుల్స్ తిరిగి పుంజుకోవటానికి మద్దతుల నిలిచినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. దీనికి తోడు కరెక్షన్ దారిలో ఉన్న మార్కెట్లలో రికవరీతో పాటు ఇండెక్స్ హెవీవెయిట్‌లలో బేరసారాల వేట కారణంగా సూచీలు గరిష్ట స్థాయికి చేరుకోవడానికి సహాయపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో కీలకంగా ఉన్న మహారాష్ట్రలో నిన్న బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయాన్ని అందుకోవటంతో సోమవారం మార్కెట్లు దానికి సానుకూలంగా ప్రభావితం అవుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
దీనికి ముందు రెండు వారాలను పరిశీలిస్తే.. ప్రధానంగా త్రైమాసిక ఫలితాల్లో పేలవమైన కార్పొరేట్ ఆదాయాలతో పాటు విదేశీ మదుపరులు భారత్ మార్కెట్లను విడిచిపెట్టడం ప్రధానంగా బేరిష్ మెుమెంటం కొనసాగించేలా చేశాయి. రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు పెరుగుదలలో ముందుండగా.. ఇంధనం మినహా చాలా రంగాలు పుంజుకోవడానికి దోహదం చేశాయి.
నష్టాలను తగ్గించుకోవటంతో పాటు బెంచ్‌మార్క్‌లో రికవరీని నడపడంలో ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు కీలకంగా వ్యవహరించాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాతో పాటు భారతదేశంలో సైతం అదానీ లంచాల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కొందరు కోర్టు మెట్లు ఎక్కటంతో రానున్న వారంలో ఈ గ్రూప్ కంపెనీల లిస్టెడ్ స్టాక్స్ ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఐపీవోల మార్కెట్ కూడా రానున్న వారంలో కీలకంగా వ్యవహరించనుంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications