Market Update: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో పాటు అనూహ్య ర్యాలీని కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి చూపు కొత్త ఏడాదిలో రానున్న వారం పైనే కొనసాగుతోంది. అయితే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో ఎలా అప్రమత్తంగా ముందుకు సాగాలి, ఏఏ అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయనే వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం..
ముందుగా స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులు ఆసక్తిగా ఈవారం గమనించటానికి వేచి ఉన్న అంశం గురువారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విడుదల చేయనున్న మూడవ త్రైమాసిక ఫలితాల గురించే. దీంతో ఐటీ దిగ్గజం టీసీఎస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కొత్త సీజన్ గణాంకాల ప్రకటనను ప్రారంభించనుంది. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, గ్లోబల్ మార్కెట్లు భారతీయ స్టాక్ మార్కెట్లకు దిశానిర్థేశంగా నిలవనున్నాయి. దీనికి తోడు స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ రూపాయి మారకపు విలువ మార్కెట్లకు కీలకంగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్, టాటా ఈఎల్ఎక్స్ఐ ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ రీసెర్చ్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు.

త్రైమాసిక ఫలితాలతో పాటు మార్కెట్ దృష్టి జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్ ప్రసంగంపై కొనసాగుతోంది. చాలా కాలంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయదారులుగా కొనసాగుతుండగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈవారం మార్కెట్లను ముందుకు నడిపించటంలో వీరి పనితీరు కీలకంగా మారుతుందని ప్రవేశ్ గౌర్ అన్నారు. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు తదుపరి సంకేతాల కోసం HSBC సర్వీసెస్ PMI, పారిశ్రామిక ఉత్పత్తి (IIP) డేటాపై ఒక కన్ను వేసి ఉంచుతారని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
గత త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఎర్నింగ్స్ కాల్ సమయంలో కంపెనీలు ఉత్తమ పనితీరుతో పాటు లాభాలను నమోదు చేస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మెుత్తంగా గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 524 పాయింట్లు పెరగగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 191 పాయింట్లు పెరుగుదలను సూచించింది. అయితే ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పైన పేర్కొన్న పరిణామాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడవ త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తాయని ఇది ఇండివిడ్యువల్ స్టాక్స్ పనితీరును ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications