Stock Market Next Week: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతివారం మాదిరిగానే రానున్న వారంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. గడచిన వారం దేశీయ మార్కెట్లు భారీగా కరెక్షన్ చూశాయి. దీంతో లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రానున్న వారంలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన చాలా మంది ఇన్వెస్టర్లలో ప్రస్తుతం కొనసాగుతోంది.
బలహీమైన ప్రపంచ సంకేతాలతో పాటు పెరుగుతున్న ఓలటాలిటీ భారతీయ ఈక్విటీ మార్కెట్లలో బేర్స్ తమ పట్టుబిగిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ట్రేడింగ్ సెషన్లలో కుప్పకూలటం గతవారం మనం గమనించాం. అలాగే కొద్ది రోజుల్లో దీపావళికి సాంవత్ 2081 దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కొనదగిన షేర్లగురించి చాలా బ్రోకరేజీలు ముహురత్ ట్రేడింగ్ స్టాక్ పిక్స్ ఇప్పటికే ప్రచురిస్తున్నాయి. గత ఏడాది దీపావళి నుంచి మార్కెట్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించటంతో ప్రస్తుతం మరోసారి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీల ఫలితాలు ఇన్వెస్టర్లను కొంత నిరాశకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానంగా భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న సమస్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును భారీగా వెనక్కి తీసుకుని చైనా మార్కెట్లకు తరలించటమే. చైనాలో ఎకానమీ బూస్టర్ ప్యాకేజ్ తర్వాత తిరిగి పుంజుకోవటంతో ఓవర్ వ్యాల్యుయేషన్ అయిన భారతీయ మార్కెట్లను ఇన్వెస్టర్లు వీడుతున్నారు. అక్టోబరు నెలలోనే దాదాపు రూ.90 వేల కోట్లను ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకోవటంతో మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ ఒత్తిడిలో షేర్లను విక్రయిస్తుండటం బెంచ్ మార్క్ సూచీలకు భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. దీనికి తోడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో కూడా మార్కెట్ల ఓలటాలిటీకి దారితీస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు.
ఇదే క్రమంలో రానున్న వారంలో డెరివేటివ్స్ మంత్లీ గడువు ముగియటం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు, ప్రపంచ సూచనలు, దేశీయంగా రానున్న ఆర్థిక డేటాపై ఇన్వెస్టర్లు ప్రధానంగా తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ 14 నెలల్లో వాటి చెత్త, సుదీర్ఘమైన వారంవారీ నష్టాలను గడచిన వారంలో నమోదు చేశాయి. దీంతో మార్కెట్లో విస్తృత అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలలో ఆఫ్‌లోడ్ చేయడం కొనసాగించారు మరియు పేలవమైన కార్పొరేట్ ఆదాయాలు సెంటిమెంట్‌ను మరింత దిగజార్చాయి. దీనికి అదనంగా లాభాల బుకింగ్, డిమాండ్ లేని వాతావరణం, మార్జిన్ ఒత్తిడి అనేక కంపెనీల నుంచి మృదువైన మార్గదర్శకత్వం వారం పతనానికి దోహదపడ్డాయి. ఈ క్రమంలో రియల్టీ, మెటల్స్ అండ్ ఆటో రంగాల షేర్లు క్షీణతను చూడగా.. ఐటీ కంపెనీలు మాత్రం ప్రస్తుతానికి స్థిరంగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మెుత్తానికి రానున్న వారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం చాలా కీలకంగా తెలుస్తోంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications