Next week IPOs: 2024లో భారతీయ ఐపీవోల మార్కెట్ చాలా యాక్టివ్ గా కొనసాగింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల అదృష్టం పండిందనే చెప్పుకోవాలి. ప్రైమరీ మార్కెట్లలోకి పదుల సంఖ్యలో కంపెనీలు తమ ఐపీవోలను ప్రవేశపెట్టి మూలధన అవసరాల కోసం డబ్బును సిద్ధం చేసుకున్నాయి. వీటిపై బెట్టింగ్ వేసిన కొనుగోలుదారులు కూడా లిస్టింగ్ నుంచి మంచి లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే.
ఐపీవోల మార్కెట్ 2024లో అద్భుతమైన పురోగతిని చూసిందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ అసాధారణమైన వృద్ధి ప్రాథమికంగా మారుతున్న భారతీయ ఈక్విటీల ల్యాండ్‌స్కేప్ ద్వారా నడపబడుతుందని బ్రోకరేజ్ పేర్కొంది. బలమైన ఫండ్ ఇన్‌ఫ్లోల మద్దతు దీనికి కారణంగా పేర్కొంది. అలాగే ఈ ఏడాది అన్ని రంగాల నుంచి కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేయాని బ్రోకరేజ్ పేర్కొంది.

రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు ప్రధానంగా మెయిన్ బోర్డ్ కేటగిరీ నుంచి వస్తున్న ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ ఐపీవో రూ.260 కోట్లను సమీకరించటం కోసం ప్రారంభం కానుంది. ఇది రిటైల్ పెట్టుబడిదారుల కోసం డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ కింద కూడా షేర్లను విక్రయానికి ఉంచుతోంది. ఇదే క్రమంలో రానున్న వారంలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో ప్రారంభం కానున్న మరో ఐపీవో ఇష్యూ టెక్నికెమ్ ఆర్గానిక్స్ కంపెనీ నుంచి వస్తోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉండనున్న ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.52-55గా నిర్ణయించింది. అలాగే తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.25.25 కోట్లను సమీకరించటానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా తాజా ఇష్యూతో వస్తోంది.
రానున్న వారంలో మార్కెట్లో లిస్టింగ్స్..
డిసెంబర్ చివరి వారం మరో రెండు రోజుల్లో ముగింపుకు వస్తున్న వేళ మార్కెట్లోకి లిస్టింగ్స్ కూడా క్యూ కట్టాయి. ముందుగా డిసెంబర్ చివరి నాటికి వస్తున్న లిస్టింగ్స్ చూస్తే.. డిసెంబర్ 30న వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరిస్ ఫార్మాసిటికల్స్, కరారో ఇండియా కంపెనీల ఐపీవోలు ఉన్నాయి. ఇక పోతే ఏడాది చివరి రోజున మార్కెట్లో యూనీమెక్ ఏరోస్పేస్ కంపెనీ షేర్లు జాబితా కానున్నాయని తెలుస్తోంది. అలాగే జనవరి 2న అన్యా పాలిటెక్ అండ్ ఫైర్టిలైజర్స్ కంపెనీ జాబితాకు సిద్ధం అవుతోంది. అలాగే రానున్న వారంలో చివరిగా జనవరి 3న లిస్ట్ అవనున్న ఐపీవో సిటికెమ్ ఇండియా. ఈ రెండు కంపెనీలు ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా కోసం వస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications