IPO News 2024: ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లలో ఏం నడుస్తోంది అని పరిశీలిస్తే ఐపీవోల క్రేజ్ నడుస్తోందని డేటా చెబుతోంది. తినటానికైనా జనం ఖర్చుపెడుతున్నారో లేదో కానీ పెట్టుబడుల కోసం మాత్రం వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. మరికొందరు మ్యూచువల్ ఫండ్లను కూడా తమ పెట్టుబడి అవసరాలను తీర్చటానికి సాధనంగా మార్చుకున్నారు.
2024లో ఇప్పటి వరకు దాదాపు 82 కంపెనీల ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గడచిన దశాబ్ధకాలంలో ఇదే అత్యధిక సంఖ్య. పైగా వీటి ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి మెయిన్ బోర్డ్ కంపెనీ ఐపీవోలు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను విజయవంతంగా సమీకరించాయి. పైగా చాలా కాలంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూసిన అనేక కంపెనీల ఐపీవోలు ఈ ఏడాది మార్కెట్లలోకి వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది భారీగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో సైతం ఐపీవోలు అరంగేట్రం చేశాయి.

ఇదే క్రమంలో గడచిన కాలంలో ఐపీవోల డేటా పరిశీలిస్తే.. 2023లో 57 ఐపీవో లిస్టింగ్స్ ద్వారా రూ.49,435 కోట్లు, 2022లో 40 ఐపీవోల ద్వారా రూ.59,301 కోట్లతో పోలిస్తే 2024లో ఐపీవోల ద్వారా భాపీ మెుత్తాన్ని కంపెనీలు తమ మూలధన అవసరాల కోసం సమీకరించాయి. 2024లో అత్యధికంగా 143 కంపెనీలు తమ డ్రాఫ్ట్ పేపర్లను సెబీ వద్ద దాఖలు చేశాయని వెల్లడైంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ 2025లో ఐపీవోల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జెప్టో, ఫ్లిప్ కార్ట్, ఇండిరా ఐవీఎఫ్, హెచ్డీఎఫ్సీ క్రెడిలా వంటి కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం మార్కెట్లోకి ఐపీవోలను తీసుకురానున్నాయని తెలుస్తోంది.
ఐపీవో డ్రాఫ్ట్ ఫైలింగ్‌లలో ఈ రికార్డ్ మార్కెట్ల అత్యుత్తమ పనితీరు వల్ల వచ్చాయి. 2024లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 13% పెరుగుదలను చూశాయి. 2023లో ఒక్కొక్కటి బలమైన 20% లాభాన్ని పొందాయి. ఇదే క్రమంలో ఐపీవో పైప్‌లైన్ పరిశీలిస్తే.. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.12,500 కోట్లు, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రూ.15,000 కోట్లు, ఎన్‌ఎస్‌డీఎల్ రూ.4,500 కోట్లు, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ రూ.3,500 కోట్లు, హెక్సావేర్ టెక్నాలజీస్ రూ.9,500 కోట్లు, ఏథర్ ఎనర్జీ రూ.4,500 కోట్లు, జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ.4,000 కోట్లు, హీరో ఫిన్‌కార్ప్ రూ.3,600 కోట్లును సమీకరించే ప్లాన్ కలిగి ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications