Budget 2025: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడం సర్వసాధారణంగా వస్తున్న అంశం. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి పద్దుల పుస్తకంతో ప్రసంగానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి బడ్జెట్ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రయత్నిస్తుందని, క్యాపెక్స్ పెంపు ఉంటుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కొన్ని షేర్లను పిక్ చేసింది. ప్రీ బడ్జెట్ సెషన్లో పెట్టుబడిదారులు వీటి ట్రైడింగ్ కోసం ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. బ్రోకరేజ్ సూచించిన స్టాక్స్ వివరాలను పరిశీలిస్తే..

1. ముందుగా పెట్టుబడిదారులు ఫోకస్ చేయాల్సిన స్టాక్ ఐసీఐసీఐ బ్యాంక్. ప్రస్తుతం స్టాక్ ముఖ్యమైన 200-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వద్ద సపోర్ట్ పొందింది. ఇది రోజువారీ చార్ట్‌లో ట్రెండ్ లైన్ బ్రేకవుట్ కూడా ఇచ్చింది. అలాగే నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ రంగంలో మంచి పనితీరును కనబరిచింది.
2. బడ్జెట్ ప్రసంగానికి ముందు పెట్టుబడిదారులు కొనుగోలు చేసేందుకు అనుకూలమైన షేర్ల జాబితాలో బజాజ్ పైనాన్స్ కూడా ఉంది. బలహీన మార్కెట్లలో కూడా స్టాక్ తన లాభాలను కొనసాగించింది. స్టాక్ 7,500 మార్క్ పైన ఫ్లాగ్ బ్రేకౌట్ వద్ద కొనసాగుతోంది. ఇది కంపెనీ షేర్లలో బులిష్ మెుమెంటంను సూచిస్తోంది.
3. మోతీలాల్ ఓస్వాల్ సూచించిన షేర్ల జాబితాలో SRF స్టాక్ కూడా ఉంది. వీక్లీ చార్ట్‌లో 2,635 స్థాయికి ఎగువన క్నురోవ్-రేంజ్ బ్రేక్‌అవుట్‌కు స్టాక్ సిద్ధంగా ఉంది. పోల్ అండ్ పెనెంట్ బ్రేక్‌అవుట్ బుల్లిష్ మొమెంటంను సూచిస్తోందని బ్రోకరేజ్ టెక్నికల్స్ ఆధారంగా కొనుగోలుకు ఉత్తమ షేరుగా ప్రకటించింది.
4. టెక్నికల్స్ పరంగా ఇన్వెస్టర్లు కొనుగోలు చేయటానికి ఉత్తమ షేర్లలో ఐషర్ మోటార్స్ కూడా చేరిపోయింది. స్టాక్ రోజువారీ చార్ట్‌లో దాని బ్రేక్‌అవుట్ స్థాయిలను విజయవంతంగా మళ్లీ పరీక్షించింది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సానుకూల మొమెంటం చూపడంతో బ్రోకరేజ్ షేరును ఇన్వెస్టర్లకు అనుకూలమైనదిగా సూచిస్తోంది.
5. ఇక చివరిగా పెట్టుబడిదారులు ప్రీబడ్జెట్ మార్కెట్లో కొనుగోలు చేయటానికి అనుకూలంగా ఉన్న షేరుగా అల్ట్రాటెక్ సిమెంట్స్ నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్ 10,500-10,700 శ్రేణిలో బలమైన మద్దతు కలిగి ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. గణనీయమైన వాల్యూమ్‌లతో బుల్లిష్ మొమెంటంను సాధించి అదే ట్రెండ్ కొనసాగిస్తోందని పేర్కొంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications