Stock Market: పెట్టుబడిదారులకు పండగ చేసిన స్టాక్.. ఒకే రోజు 20 శాతం పెరిగింది..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఒక స్టాక్ పెరుగుతుందని పెట్టుబడి పెడితే.. ఆ స్టాక్ పడిపోతుంది. అందుకే నిపుణుల సలహా, సూచనలు పాటిస్తూ పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్ లో మంచి క్వాలిటీ స్టాక్స్ గుర్తిస్తే లాభాలు వస్తాయంటున్నారు. తాజాగా ఓ కంపెనీ షేర్లు అమాంతం పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ సోమవారం సెషన్ లో దాదాపు 20 శాతం పెరిగింది.
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ హైపర్‌నెక్స్ట్ నుంచి ఒక భారీ ఆర్డర్ రావడంతో పాటు జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్ పై బుల్లిష్ గా ఉండడంతో స్టాక్ ప్రైస్ రూ.2,389 వద్ద అప్పర్ సర్క్యుట్ ను తాకింది. ఈ స్టాక్ గత సెషన్ లో రూ.1955 వద్ద ముగిసింది. కాగా సోమవారం సెషన్ ముగిసేలోగా కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ 7.72 పెరిగి రూ. 2,082.90 వద్ద స్థిరపడింది. ఈ బ్రోకరేజ్ సంస్థలు స్టాక్‌ను 'యాడ్' నుంచి 'బై'కి అప్‌గ్రేడ్ చేసింది. టార్గెట్ ప్రైస్ ను రూ. 1,955 నుంచి రూ. 2,430కి పెంచింది. దీంతో కొనుగోళ్ల డిమాండ్ పెరిగి స్టాక్ పెరిగింది. కాగా ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కావడం విశేషం.

ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రూ. 34.72 వేల కోట్లుగా ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 828.15 గా ఉంది. ఇక నెల వ్యవధిలో ఈ స్టాక్ 43 శాతం పెరిగ్గా... 6 నెలల్లో 82 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాదిలో 182 శాతం పెరిగింది. హైపర్‌నెక్స్ట్ నుంచి 192 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి ఆర్డర్ పొందినట్లు KOEL ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇందులో దాని 2500 kVA ఆప్టిప్రైమ్ డ్యూయల్ కోర్ పవర్ సిస్టమ్స్‌కు చెందిన 96 యూనిట్లు వివరించింది. దేశంలోని హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల కోసం అధిక సామర్థ్యం గల పవర్ సిస్టమ్స్‌ను వినియోగించే అతిపెద్ద కాంట్రాక్టులలో ఇది ఒకటని కంపెనీ తెలిపింది.
ఈ ఆర్డర్ కపెంనీ ఇంజనీరింగ్ సామర్థ్యాలకు నిదర్శమని ఆ సంస్థ గ్లోబల్ పవర్ జెన్ బిజినెస్ ప్రెసిడెంట్ మదన్ పాటిల్ తెలిపారు. ఈ ఆర్డర్ తమ సామర్థ్యంపై డిజిటల్ మౌలిక సదుపాయాల రంగ ప్రముఖులు ఉంచుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ నడుస్తోంది. దీంతో డిజిటల్ మౌలిక సదుపాయాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు చున్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అందించే కంపెనీలకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఏ స్టాక్ లోనైనా తొందరపడి పెట్టుబడి పెట్టొద్దని సూచిస్తున్నారు.
కంపెనీ ఫండమెంటల్ పరిశీలించాలని, అలాగే కంపెనీ మేనెజ్ మెంట్ సరిగా ఉందో లేదో తెలుసుకోవాలని చెబుతున్నారు. భవిష్యత్ కంపెనీ ఎలా వ్యవహరించబోతుందో కూడా తెలుసుకోవాలన్నారు. ఒకవేళ స్టాక్ పై పరిశోధన చేయడం వీలుకాకుంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications