IPO News: తెరుచుకోకముందే 100 శాతం లాభమిచ్చిన ఐపీవో.. ఇది కద సార్ ఇన్వెస్టర్స్ అడిగేది..!
Jungle Camps India IPO: డిసెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లతో పాటు ఐపీవోల ఇన్వెస్టర్లు కూడా మంచి బౌన్స్ బ్యాక్ చూశారు. పుష్ప-2 సినిమా కరెక్షన్ల మాదిరిగానే ఐపీవో ఇన్వెస్టర్ల లిస్టింగ్ గెయిన్స్ బాక్సాఫీసులను బద్ధలకొడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఐపీవోలపై తమ బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. చాలా వరకు ఐపీవోలు లిస్టింగ్ ముందు గ్రేమార్కెట్లో చూపిన పనితీరును లిస్టింగ్ రోజున కూడా ప్రతిబింబిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జంగిల్ క్యాంప్ ఇండియా కంపెనీ ఐపీవో గురించే. ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లకు ఈ ఇది శుభవార్తని చెప్పుకోవాలి ఎందుకంటే ఐపీవో ఇష్యూ ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.29.42 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ ఇన్వెస్టర్లకు 40.86 తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో బీఎస్ఈలో లిస్టింగ్ కోసం సిద్ధం అవుతోంది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 12 వరకు అందుబాటులో ఉండనుంది.

కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.68-72గా నిర్ణయించటంతో పాటు లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా ఫిక్స్ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనటం కోసం కనీసం రూ.1,15,200 కనీసం పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోంది. ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలో షేర్లు డిసెంబర్ 13న డిపాజిట్ చేయబడతాయని, డిసెంబర్ 17న దేశీయ స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్టింగ్ కానున్నాయని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. గజేంద్ర సింగ్, లక్ష్మీ రాథోడ్, యశోవర్ధన్ రాథోడ్, రణవిజయ్ సింగ్ రాథోడ్, రాథోడ్ HUF కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నాయి. ఐపీవోకి ముందు కంపెనీలో వీరికి సంయుక్తంగా 94.57% వాటాలు ఉన్నాయి.
లిస్టింగ్ ముందే గ్రేమార్కెట్లో అరాచకం..
గ్రే మార్కెట్‌లో లిస్టింగ్ ఓపెన్ కాకమునుపే ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న భారీ స్పందనతో ఐపీవో షేర్ల 104% ప్రీమియం ధర పలుకుతున్నాయి. వాస్తవంగా కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం గరిష్ఠ ధర రూ.72 వద్ద షేర్ ఉండగా ప్రీమియం ఒక్కో షేరుకు రూ.75 పలుకుతోంది. దీని ప్రకారం లిస్టింగ్ రోజున స్టాక్ మార్కెట్లో షేర్లు ఇదే జీఎంపీ కొనసాగితే రూ.147 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2002లో స్థాపించబడిన జంగిల్ క్యాంప్స్ ఇండియా దేశంలో వైల్డ్ లైఫ్ క్యాంప్స్ అండ్ హోటళ్లు, మోటల్స్, ఇన్‌లు, గెస్ట్ హౌస్‌లు, హాలిడే హోమ్‌లు, హెల్త్ క్లబ్‌లు, క్యాటరింగ్ హౌస్‌లు, రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. సెంట్రల్ ఇండియా అంతటా ప్రధాన వన్యప్రాణులు, టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులలో నాలుగు అవార్డులు గెలుచుకున్న బోటిక్ రిసార్ట్‌లను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ రిసార్ట్‌లతో పాటు, గ్రూప్ హైవే రిట్రీట్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తుంది.


Click it and Unblock the Notifications