IPO News: రూ.4000 కోట్ల మెగా ఐపీవోకు గ్రీన్ సిగ్నల్.. ఇన్వెస్టర్స్ డబ్బు సిద్ధం చేస్కోండి..
JSW Cement IPO: నిరంతరాయంగా వస్తున్న ఐపీవోల్లో పెద్ద కంపెనీలు సైతం పాల్గొంటున్నాయి. చాలా కాలంగా తమ ఐపీవోలను వాయిదా వేస్తూ వచ్చిన కంపెనీలు కూడా ప్రస్తుతం తమ ప్రాన్స్ ఆచరణలో పెడుతున్నాయి. ఇదే క్రమంలో మరో పెద్ద ఐపీవో రాకకు రంగం సిద్ధం కావటం ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీ ఐపీవో ప్లాన్ గురించే. ప్రస్తుతం ఐపీవో ఫ్లోట్ చేసేందుకు సెబీ వద్ద అనుమతి కోసం దాఖలు చేసిన ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని సిమెంట్ వ్యాపారాన్ని లిస్ట్ చేయటం ద్వారా మార్కెట్ల నుంచి రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఐపీవో ప్రారంభ తేదీని కంపెనీ ప్రస్తుతం ప్రకటించలేదు. అయితే ఐపీవో ఫ్లోట్ చేసేందుకు అనుమతి కోరుతూ డీఆర్హెచ్పీని కంపెనీ ఆగస్టు 17, 2024లో దాఖలు చేసింది.

ప్రస్తుతం జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ సజ్జన్ జిందాల్ కింద పనిచేస్తున్న మెటల్ నుంచి ఇన్ ఫ్రా వ్యాపారాల్లో భాగంగా కొనసాగుతోంది. దీనికి ముందు గత ఏడాది సెప్టెంబరులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఐపీవో అప్రూవల్ ప్రాసెస్ హోల్డ్ లో పెట్టింది. ప్రమోటర్ కుటుంబానికి చెందిన కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది. 2021 ఆగస్టులో నొవాకో విస్టా కంపెనీ మెగా రూ.5000 కోట్ల ఐపీవో తర్వాత సిమెంట్ రంగంలో మరో ఐపీవో ఎంట్రీ ఇస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ప్రస్తుతం తీసుకొస్తున్న ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్, ఫ్రెష్ ఇష్యూ కలిసి ఉండనున్నాయని వెల్లడైంది. ఇందులో రూ.2000 కోట్లకు తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉంటుండగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వాటాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు జేఎస్డబ్ల్యూ ఇన్ ఫ్రా సంస్థ తన ఐపీవోను 2023లో వచ్చింది. ఇది గ్రూప్ 13 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత విడుదల చేసిన తొలి ఐపీవో కాగా ప్రస్తుతం సిమెంట్ వ్యాపారాన్ని లిస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
మార్కెట్లో ఒకపక్క బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో వేగంగా మార్కెట్ సొంతం చేసుకునేందుకు కొత్త కొనుగోళ్లను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2017లో జేఎస్డబ్ల్యూ సిమెంట్ సంస్థ కూడా శివ సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయటం గమనార్హం. ప్రస్తుతం ఐపీవో ద్వారా వచ్చే సొమ్మును కంపెనీ నాగపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లోని కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications