స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఈ 33 షేర్లలో పెట్టుబడి పెట్టమంటున్న జేపీ మోర్గాన్..

JPMorgan's 2027 India Stock List: కార్పొరేట్ ఆదాయాల వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో.. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం జేపీమోర్గాన్ (JPMorgan) 2027 సంవత్సరానికి గాను తన ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ నివేదికను విడుదల చేసింది. భారతీయ ఈక్విటీలపై దీర్ఘకాలికంగా సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూనే, అధిక వాల్యుయేషన్లు, కఠినమైన ద్రవ్య విధానం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా మదుపర్లు ఎంపికతో కూడిన (Selective) విధానాన్ని అనుసరించాలని సూచించింది.

2026 క్యాలెండర్ సంవత్సరంలో MSCI ఇండియా కంపెనీల ఆదాయాలు 12 శాతం.. 2027లో 14 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేసిన జేపీమోర్గాన్, 2027 చివరి నాటికి నిఫ్టీ 50 సూచీ 29,000 స్థాయికి చేరుకుంటుందని బేస్-కేస్ లక్ష్యాన్ని నిర్దేశించింది. తగ్గుతున్న ముడిచమురు ధరలు, బలమైన రుణ వృద్ధి, స్థిరమైన దేశీయ వినియోగం, ప్రైవేట్ రంగ మూలధన వ్యయ చక్రం (Capex) మార్కెట్‌కు దన్నుగా నిలుస్తాయని.. అంతేకాకుండా గ్లోబల్ ఏఐ (AI) ట్రేడ్‌లలో అధిక రద్దీ నుండి వైవిధ్యం కోరుకునే విదేశీ లాంగ్-ఓన్లీ ఇన్వెస్టర్ల నుండి భారత్‌కు సుమారు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది.

JPMorgan 2027 India stock picks JPMorgan top 33 stocks 10 stocks to avoid JPMorgan India equity strategy best Indian stocks 2027 ICICI Bank HDFC Bank Bajaj Finance Nifty 2027 target JPMorgan stock recommendations Indian stock market outlook 2027 33 10 2027

దేశీయ వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ జేపీమోర్గాన్ నాలుగు కీలక రంగాలలో తన అత్యంత ప్రాధాన్యత గల స్టాక్‌ల జాబితాను ప్రకటించింది. ఇందులో ఫైనాన్షియల్స్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏంజెల్ వన్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లను ఎంపిక చేసింది.

Also Read

పారిశ్రామిక, మౌలిక రంగాలలో లార్సెన్ & టూబ్రో (L&T), అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), జీఈ వెర్నోవా టీ&డీ ఇండియా, హిటాచీ ఎనర్జీ ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్‌తో పాటు యుటిలిటీస్ విభాగం నుండి ఎన్‌టీపీసీ (NTPC) లను ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. ఇక హెల్త్‌కేర్ రంగం నుండి డివిస్ లాబొరేటరీస్, మాక్స్ హెల్త్‌కేర్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా, ఆంథెమ్ బయోసైన్సెస్‌లకు మొగ్గు చూపగా..వినియోగదారుల ఐచ్ఛిక (Consumer Discretionary) విభాగంలో టీవీఎస్ మోటార్, టాటా మోటార్స్, సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్, టైటాన్, లీలా ప్యాలెస్ హోటల్స్ & రిసార్ట్స్‌లను అగ్రశ్రేణి ఎంపికలుగా గుర్తించింది.

మరోవైపు మెటీరియల్స్, ఐటీ, ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ స్టేపుల్స్ రంగాలకు చెందిన 10 అతి తక్కువ ప్రాధాన్యత గల స్టాక్‌ల జాబితాను కూడా జేపీమోర్గాన్ వెల్లడించింది. ఇందులో ఎన్‌ఎండీసీ (NMDC), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ కార్డ్స్, యెస్ బ్యాంక్‌లకు పూర్తిస్థాయి 'అండర్‌వెయిట్' రేటింగ్ ఇవ్వగా.. కోల్ ఇండియా, సెయిల్ (SAIL), మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, డాబర్ ఇండియా, కోల్గేట్-పామోలివ్ ఇండియాలకు న్యూట్రల్ రేటింగ్‌లను కొనసాగించింది. అంటే ఈ పదింటిని తక్కువ ప్రాధాన్యత జాబితాలో చేర్చినప్పటికీ వాటన్నింటిపై పూర్తి వ్యతిరేక సిఫార్సు లేదని నివేదిక స్పష్టం చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+