ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ కంపెనీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక ప్రమాదకర మలుపు వద్ద నిలబడి ఉందని JPMorgan CEO Jamie Dimon హెచ్చరిస్తున్నారు. నేటి మార్కెట్ పరిస్థితులు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌కు ముందు ఉన్న 2005-07 కాలాన్ని గుర్తు చేస్తున్నాయని వార్నింగ్ బెల్ మోగించారు. అప్పట్లో కూడా మార్కెట్లు భారీగా ఎగసిపడ్డాయి. ఇన్వెస్టర్లకు లాభాలు వెల్లువలా వచ్చాయి. అయితే ఆ వెనుక దాగి ఉన్న ప్రమాదాలను చాలా మంది గుర్తించలేకపోయారని డిమోన్ గుర్తు చేశారు. దీంతో ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్లు ఎత్తైన స్థాయిల్లో ఉన్నాయి. ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ బూమ్ వాతావరణంలో అనేక సంస్థలు, పెట్టుబడిదారులు త్వరగా ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడంతా బాగానే ఉంది కాబట్టి, ఇదే పరిస్థితి ఎప్పటికీ కొనసాగుతుందని భావించడం చాలా ప్రమాదకరమని డిమోన్ హెచ్చరించారు.

డిమోన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉప్పొంగుతున్న ఆటుపోట్లు అన్ని పడవలను పైకి లేపుతాయి అనే నానుడిని ఉపయోగించారు. అంటే మార్కెట్ పైకి వెళ్తే దాదాపు అందరికీ లాభాలు వస్తున్నట్లే కనిపిస్తాయి. కానీ అసలు సమస్య ఏమిటంటే.. ఆ పైకి లేచిన అల ఒక్కసారిగా తగ్గితే, ఎవరు ఈత కొట్టగలరో, ఎవరు మునిగిపోతారో అప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొందరు తమను తాము విజేతలుగా చూపించుకోవడానికి అవసరానికి మించిన రిస్క్‌లు తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంకొక కీలక అంశం కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా హెచ్చరించారు. డిమోన్ అభిప్రాయం ప్రకారం.. AI భవిష్యత్తులో అనేక పరిశ్రమలను పూర్తిగా మార్చివేయగల శక్తి కలిగి ఉంది. 2008కి ముందు కాలంలో వార్తాపత్రికలు, విద్యుత్, టెలిఫోన్ కంపెనీలు చాలా సురక్షితమైన రంగాలుగా భావించబడ్డాయి. కానీ ఆ తరువాత అవే రంగాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు అదే విధంగా సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగాలపై AI ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఈ AI భయాలే ఇటీవల టెక్ స్టాక్‌ల పతనానికి కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, AI వల్ల సంప్రదాయ ఉద్యోగాలు, బిజినెస్ మోడల్స్ ప్రమాదంలో పడతాయేమో అన్న ఆందోళనతో టెక్ షేర్లను అమ్ముతున్నారు. ముఖ్యంగా Anthropic సంస్థ కొత్త AI టూల్స్‌ను విడుదల చేసిన తర్వాత ఈ భయాలు మరింత పెరిగాయి. ఈ టూల్స్ చట్టపరమైన సేవలు, మార్కెటింగ్, సేల్స్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఆటోమేట్ చేయగలవు. దీని వల్ల అనేక కంపెనీల ఆదాయ నమూనాలు మారిపోతాయనే భయం మార్కెట్‌ను కుదిపేసిందని చెప్పుకొచ్చారు.
డిమోన్ చివరగా ఏమంటున్నారంటే.. ప్రమాదం ఒక్కసారిగా రాదు, అది బూమ్ సమయంలోనే నెమ్మదిగా పెరుగుతుంది. ఎప్పుడు ఏ సంఘటన ఈ పరిస్థితిని తలకిందులు చేస్తుందో చెప్పడం కష్టం. కానీ అధిక ధరలు, అధిక రిస్క్, AI వంటి వేగంగా మారుతున్న టెక్నాలజీ కలిసి ఒక కొత్త ఆర్థిక చక్రానికి దారి తీయవచ్చని ఆయన హెచ్చరిక. అందుకే పెట్టుబడిదారులు ఈ బూమ్‌ను చూసి అతి ఆత్మవిశ్వాసానికి పోకుండా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని మార్కెట్ నిపుణులు సైతం చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications