జేపీ పవర్ (జైప్రకాష్ పవర్ వెంచర్స్) షేర్లు గత రెండు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం, నవంబర్ 20న ఈ షేరు ధర NSE లో 12% వరకు పెరిగి రూ. 22.79 గరిష్ట స్థాయిని తాకింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్టాక్ ఏకంగా 27 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే ఒకపక్క జేపీ పేరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్(JAL) దివాలా ప్రక్రియలో ఉంటే జేపీ పవర్ షేర్లు ఎందుకు ఇలా ర్యాలీ అవుతున్నాయి. అసలు కారణం ఏంటంటే..

జేపీ పవర్ పేరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం ఈ వార్తల ఆధారంగానే జేపీ పవర్ షేర్లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. జైప్రకాష్ అసోసియేట్స్ (JAL) కంపెనీకి జేపీ పవర్ (JP Power) లో సుమారు 24% వాటా ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న అదానీ గ్రూప్ JAL ను దక్కించుకుంటే దాని ప్రభావం JAL కింద ఉన్న JP Power పై కూడా సానుకూలంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అంచనా ఇదే..
అదానీ వంటి పటిష్టమైన గ్రూప్ JP Power లోకి పరోక్షంగా ప్రవేశిస్తే కంపెనీ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. తద్వారా JP Power బిజినెస్ వాల్యూ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదానీ గ్రూప్ ఎంట్రీ ఇవ్వడం వల్ల JP Power కి బ్యాలెన్స్ షీట్ బలం పెరుగుతుందని లాంగ్ టర్మ్ లో కంపెనీ మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
అదానీ vs. వేదాంత
రుణాలు చెల్లించడంలో విఫలమైన జైప్రకాష్ అసోసియేట్స్ (JAL) దివాలాకు దగ్గర్లో ఉంది. అయితే ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి అదానీతోపాటు వేదాంత (Vedanta) కూడా పోటీ పడుతుంది. వేదాంత రూ. 17,000 కోట్లతో బిడ్ వేయగా..అదానీ బిడ్ రూ. 13,500 కోట్లు బిడ్ వేసింది. వేదాంత కంటే అదానీ గ్రూప్ బిడ్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు అదానీ బిడ్‌నే ఎంచుకున్నాయి. అదానీ గ్రూప్ వెంటనే డబ్బు చెల్లించడానికి అంగీకరించడంతోపాటు చెల్లింపుల గడువును 1.5-2 సంవత్సరాలుగా నిర్ణయించింది. దాంతో బిడ్ అదానీకి దక్కింది.
ఇప్పుడు కొనొచ్చా?
ప్రస్తుతం జేపీ పవర్ షేర్ ధర(jp power share price) భారీగా ర్యాలీ అవుతుంది. అదానీ గ్రూప్ రాకపై ఉన్న అంచనాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. అయితే ఈ డీల్‌కు సంబంధించి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ తుది నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ పెరుగుదల నిలబడుతుందో లేదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు మరికొన్ని రోజులు వేచి చూశాక పెట్టుబడి పెడితే మంచదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications