Jio IPO: జియో ఐపీఓ వచ్చిన వారికి పండగే.. గ్రే మార్కెట్లో రూ.244 ప్రీమియంలో ట్రేడవుతున్న షేర్లు..!
దేశంలోనే అతి పెద్ద ఐపీఓ జియో ఐపీఓకు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నవారికి సోమవారం షేర్లు కేటాయించారు. షేర్లు రానివారికి రీఫండ్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం ఎక్స్ఛేంజీలలోకి ప్రవేశించనున్నాయి. కేటాయింపులు పొందిన పెట్టుబడిదారులు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈ షేర్లను అట్టిపెట్టుకోవాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో కంపెనీ అగ్రగామి స్థానం ఉందని చెబుతున్నారు. బలమైన లాభదాయకత, విస్తరించగల టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, వృద్ధి అవకాశాలు దాని వాల్యుయేషన్‌కు మద్దతునిచ్చాయని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎంటర్‌ప్రైజ్ డిజిటల్ సర్వీసెస్, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లోని అవకాశాలు కూడా దీర్ఘకాలిక వృద్ధికి ఆస్కారం కల్పిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు. తుది ఇష్యూ ధర వద్ద, జియో ప్లాట్‌ఫామ్స్ విలువ దాని FY2026 ప్రైస్-టు-ఎర్నింగ్స్ నిష్పత్తికి 34.3 రెట్లు, దాని FY2026 ఎంటర్‌ప్రైజ్ వాల్యూ-టు-EBITDA నిష్పత్తికి 14.8 రెట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇది దాదాపు రూ. 10.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సూచిస్తోందని వివరించారు.అయితే టెలికాం నియంత్రణ, స్పెక్ట్రమ్ అవసరాలు, సాంకేతిక అంతరాయాలు, సైబర్ సెక్యూరిటీ ముప్పులు ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయని గుర్తు చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం, డిజిటల్ సేవల విభాగం ప్రారంభమైన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. తద్వారా ఇది భారత చరిత్రలోనే అత్యంత వేగంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన పబ్లిక్ ఇష్యూగా నిలిచింది. రూ. 5,500 కోట్ల విలువైన క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా మొదటి 10 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. బిడ్డింగ్ ముగిసే సమయానికి, ఈ ఐపీఓ 22.2 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. పబ్లిక్ ఇష్యూ, యాంకర్ ప్లేస్‌మెంట్ ద్వారా వచ్చిన మొత్తం డిమాండ్ రూ. 7.4 లక్షల కోట్లను దాటింది. జియో షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. ఒక్కో షేరు రూ.244 ప్రీమియంలో ట్రేడవుతోంది.
జీఎంపీని బట్టి చూస్తు బుధవారం స్టాక్ రూ.1,363 వద్ద లిస్టయ్యే అవకాశం ఉంది. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఊహాజనితం మాత్రమే. ఇది కచ్చితమైన అంచనా కాదు. ఒకవేళ ఒక లాట్ వచ్చినట్లయితే 12 షేర్లు అలాట్ అవుతాయి. ఒక్కో షేరు జీఎంపీలో రూ.244 ట్రేడవుతోంది. అంటే స్టాక్ రూ.1,363 పెట్టుబడిదారులకు రూ.2928 లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కచ్చితమైన అంచనా కాదని గుర్తించుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications